పోస్ట్‌లు

దోస్త్

చిత్రం
తీపి,పులుపు,వగరు కారం,చేదు,ఉప్పు అనే షడ్రుచుల సమ్మేళనంలా  జిందగీలో ఎదురయ్యే అనుభవాలు సుఖం దుఃఖం, కష్టం నష్టం, బాధ సంతోషం  మనసులో కలిగే ఉద్వేగాలు స్నేహం మోహం వ్యామోహం ప్రేమ ఆప్యాయత అనురాగం విరక్తి వైరాగ్యం లాంటి వాటి వల్ల ఆందోళననో, ఆనందమో... ఏదైనా సరే స్వీకరిస్తూ...జీవనయానం సాగిపోవాలని  తెలిపే...అర్థవంతమైన తత్వమే... ఉగాది పచ్చడి విశిష్టత  అలాంటి మనస్తత్వం కలిగిన మా మనసుల సమ్మేళనంలో మర్చిపోలేని...అనుభవాలు  గుర్తుండిపోయే...క్షణాలు  సంతోషపడిన...సమయాలు  ఎప్పటికప్పుడు నూతనంగా రూపుదిద్దుకునే మా జిందగీ ఎవరికి అర్థం కాని పరిచయం వేరే ఎవరితోను పోలిక లేని స్నేహం అహం అణువంతయిన కానరాని దోస్తాన్ వేర్వేరు లక్ష్యాలున్న... ఉమ్మడి ప్రణాళికల కలిగిన అభ్యర్థులం ఉద్యోగార్థులం  ఒక్కొక్కరు‌... ఒక్కో తీరుగా సంతోషం సొంతమైన వాళ్ళం  ఫిల్టర్ లేని మాటలతో... ఫిలాసఫీకల్ గా మాట్లాడుకునే మనుషులం జాతి రత్నాలం😜 ఉగాది పచ్చడిలో రుచిలా... అందరం కలిసి ఎంజాయ్ చేస్తున్న సోపతులం  హ్యాపీ ఉగాది 😋🥳

ఉగాది శుభాకాంక్షలు

కాలం వేగిరమై కదలిపోతుంటే క్రోధి నామ సంవత్సరం అమాంతం దూరమైపోయింది గడిచిన రోజుల స్మృతులన్ని బాధ్యతల్ని పెంచినా బాధల్ని మిగిల్చినా రేపటికై మన మంచికే అనుకుందాం కాలం చేసే విచిత్రాలలో... మోడుబారిన శిశిరం చింతించేలా చేసినా చిత్రంగా ఛైత్రం మన ముందుకొస్తూ పర్వదినమైన యుగాదిని తెస్తూ బోసిపోయిన తరువులకు చిగురాకులను వరముగా యిస్తూ వసంత ఋతువుతో మనసంతా  ఆశలు చిగురించి ఆలోచనలన్ని ఆశయాలుగా మారుస్తూ... మనసుకు ఎనలేని సంతోష సౌభాగ్యాల్ని ప్రసాదిస్తూ... షడ్రుచుల సమ్మేళితమైన జీవనాన్ని అవగాహనతో ఆలోచనాత్మక ఆనందంతో... సాగిపోవాలని ప్రకృతి నేర్పే సంప్రదాయిక పాఠమే ఈ ఉగాది... # విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు💐

😜

చిత్రం
తాగితే ప్రతోడు  తత్వవేత్త అయిపోతాడు😜

సింగిల్ 😜

సింగిల్ గా కూర్చొని సినిమాలు సిరీస్ లు చూస్తుంటే అందులో ఇష్క్ జంటల కనిపించినప్పుడల్లా ఒంటరిగా ఉండలేక పోతున్న ఓ మై గాడ్ వేర్ ఈజ్ మై జోడి అని దిల్ ఒకటే దిగులుతో ఉంది  సోలో గాని సోల్ మేట్ ఎక్కడుందో😜

బర్త్ డే శుభాకాంక్షలు 🥳

పుట్టే బిడ్డ కోసం  పురిటి నొప్పుల బాధను అనుభవిస్తూ  చావు అంచుల వరకు వెళ్లి భయాన్నే భయపెట్టి విజవంతంగా  మనల్ని లోకానికి పరిచయం చేస్తుంది అమ్మ  ఒళ్ళంతా పచ్చి ముద్దైనా  ఒడిలోని పసిపాపను ముద్దాడుతూ  భరించలేని ఆవేదనని ఆనందం అనుభవిస్తుంది అమ్మ  మన జీవితంలో ప్రతి క్షణం అమ్మ తొమ్మిది నెలలు కన్న కలలకు తార్కాణం మనం అణువులా మారి గర్భాలయంలో ఉండగానే మన అందాన్ని కూడా చూడకుండానే  ప్రేమించడం మొదలు పెట్టే ఒకే ఒక్క వ్యక్తి అమ్మ  మన పుట్టిన రోజును  ఎంత ఎంజాయ్ చేస్తామో  అంతే సంతోషంగా  మనం పుట్టిన క్షణాల్ని  అమ్మ పురిటి గడియల్ని  మనల్ని మోసిన నవ మాసాల రోజుల్ని అన్నింటిని తలుచుకుంటు నిండు మనసారా దీవించే అమ్మ ప్రేమ  సృష్టిలోనే ఓ అద్భుతం అంతకు మించిన నిస్వార్థ త్యాగం మరేది లేదు  బర్త్ డే అంటే... మనం మాత్రమే పుట్టిన రోజు కాదు  మనతో పాటు మరోసారి అమ్మకూడా పుట్టింది అందుకే మన బర్త్ డే తో పాటు  అమ్మకి కూడా హృదయ పూర్వక శుభాకాంక్షలు చెప్పుకుందాం  ఈ జూలై 6 నాకు అత్యంత ఆత్మీయ బంధువు  LaOneya నా సాహితీ మిత్రురాలు మై డియర్...

వందనం

వి లువైన అధ్యాత్మిక సంపదను వే ల సంవత్సరాలకు తరిగిపోని కా నుకగా ! భారతావనికే కాక ప్రపంచంమనె నం దన వనం పులకించిపోయోలా ఆనంద ద రహాసములతో ప్రకృతిలో ప్రతి ప్రాణి స్వా ర్థ రహితమై సత్య ధర్మముల సంరక్షణలో మి త్రులగా అంతా భగవంతుడే అనే నినాదంతో శ్రీ రామ చంద్రునితో కీర్తి గాంచిన అయోధ్య ' రా 'మ రాజ్య అపూర్వ శోభితను పవిత్రమైన మ నసుతో నేటి మానవులు సాధించగలరని కృ షిపట్టుదల ఉద్రేకపు కవో ష్ణ  ఉత్తేజాన్ని ధృఢసంకల్పాన్ని ఆత్మస్థైర్యాన్ని ప టిష్టపరిచి నూతనోత్సాహంగా ర మణీయంగా దేదీప్యమానంగా వివేకవంతులుగా మ స్తిష్కాలోచన పరులుగా మానవ జాతి అ హం  వీడి స్నేహభావంతో మెలిగే విధంగా స త్య ప్రవచనాలు చెప్పడమే కాదు స్వయంగా సేవ చేసిన జగన్మాత పుత్రులు పరమేశ్వర స్వరూపులు గురుశిష్యుల అనుబంధానికి నిజమైన నిర్వచనంగా నిలిచిన దార్శనికులు ఆదర్శ మూర్తులు హైందవ ధర్మ పరిరక్షకులు భరతమాత కే కీర్తి తెచ్చిన శ్రీ రామకృష్ణ పరమహంసా ! ఓ వివేకానంద స్వామీ ! మీకు మనఃపూర్వక అభివందనములు                        ...

28 August Special 🥳🥰

మై డియర్ మా ❣️ ఊహాత్మక ప్రపంచంలో మొట్టమొదటగా స్వప్నంలా పరిచయం అయ్యి నిజమైపోయిన బుజ్జమ్మ నీకు 4వ బర్త్ డే శుభాకాంక్షలు మా 💐🌹🍫. 4 వ బర్త్ డే ఏంటి అనుకుంటున్నవా 🤔😁 ఆగు...ఆగు అక్కడికే వస్తున్న నాకు పరిచయం అయ్యాకా నాకు అమ్మగా మళ్ళీ పుట్టి ఇప్పటికి 4 వ వత్సరం అవుతుంది బుజ్జి అందుకే నానిగా నవ్వుతూ... నాలుగవ బర్త్ డే శుభాకాంక్షలు మా🍫🍫🍫🍫🍫. మనల్ని కలిపిన వేదిక ఏదైనా కావచ్చు మన అభిరుచులతో ఓ బంధంగా మారిపోయి మనోహరమైన అనుబంధంగా నిలిచిపోయేలా చేసిన సాహిత్యానికి సంతోషంతో థ్యాంక్స్ చెబుతూ.. .మై డియర్ బుజ్జమ్మ నీకు అందమైన పుట్టిన రోజు శుభాకాంక్షలు 🌹🌹🌹🌹. ఆన్ లైన్ సమీక్షల నుంచి ఆఫ్ లైన్ లో మంచి చెడుల జాగ్రత్తలు చెప్పేంత వరకు అభివృద్ధి చెందిన మన అనుబంధం ఇట్లనే ఉంటదని శ్వాసిస్తూ నాలుగవ సారి నాలుగవ బర్త్ డే శుభాకాంక్షలు మా 💐💐💐 మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు నాని... అంటూ పిలిచిన నీ వాత్సల్యపు మాధుర్యం గిప్పటికి నా ఫోటోగ్రాఫిక్ మొమోరిలో ముద్రించుకపోయింది.రెండవసారి కలిసినప్పుడు ప్రేమతో... ఏదైనా తినిపించాలి అనుకున్న నీ తపనకే నా కడుపు నిండిపోయింది. అప్పుడు మనం కొన్ని నిమిషాలే మాట్లాడుకున్నా అవన్నీ మ...