పోస్ట్‌లు

ఏప్రిల్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

ఎవరివో... నువ్వు

కనులలో కనిపించే రూపానివో.. నిదురలో నిలిచిన కలవో..! పెదవులపై పలికే పలుకువో.. మౌనం వీడని మాటవో..! వెలుగులు పంచే వెన్నెలవో.. చీకటిని నింపే నిశిదివో..! విజయం చేకూర్చే తోడువో.. ఒంటరిని చేసే ఓటమివో..! ఎదలయను పెంచే సడివో.. మదిని మెలిపెట్టే జ్ఞాపకానివో..! జీవితంలో ఆరంభమైన ఆశవో.. బ్రతుకులో భారమైన బంధానివో..! సంతోషం పంచే స్నేహితుడివో.. కలతై మిగిలిపోయే కాలానివో..! ఏమో.. ఎవరివో నీవు..!                 - చిన్నూ✍️

ఉగాది యాదిలో

పొద్దున్నే తెల్లార్తుంటెనే అమ్మ నిద్ర లేప్తూ... రేయ్..లేవ్రా ఇయ్యాల పండ్గపూట అట్ల పండుకోకపోతే అట్లవొయ్ మాడాకాలు,మోదుగ ఆకులు,యాప పూత తీసుకుని రావచ్చు కదా అగో...బయట మీ దోస్త్ గాడు వచ్చి ఎదురు సూస్తుండు పో అని నిద్ర అంత కరాబ్ చేసింది. అమ్మ మనకు మాడి శెట్లు ఎక్కడివే... "పండ్గ పూట ఎవడితోనో మాటలు తినమంటవ్" నేను పోనుపో...అన్నగాన్కి శెప్పరాదు ఎప్పుడు నేనే పోవాల్నా. అరే చిన్నోడా... పెద్దోడు అప్పుడే...పండ్గ సమాన్ తేనికే చిట్టి రాసుకుని దుక్నం కాడికి పోయిండు. నువు షాప్ కాడికి పోరా అంటే సగం సగం సమాను తెస్తవ్ పోనీ చిట్టి రాసుకోని పోయి తెస్తవా అంటే అమ్మో..."మా ఇస్కూల్ ల ఇంకా అంత పెద్ద సదువు నేర్పలేదే అంటవ్". అందుకే నిన్ను పొలాల పోంటి పోయి ఆకులు తెమ్మనేది. అయినా రాతిరి నువ్వే శెప్పినవ్ కదరా అమ్మ "రేపు పండ్గకి మాడాకులు నేనే తెస్తనే నాయనను తేవొద్దను అని" ఇప్పుడు ఇట్ల అంటవ్ బాతకానోడా  నీ మాటలు పట్టుకోని "మీ నాయనకు తేవొద్దు అని శెప్పిన నేను దిమాక్ లేని దానిని"  "అమ్మా పోతున్ననే పండ్గపూట ఎందుకు తిడ్తవ్" నేను వచ్చే వరకైతే బచ్ఛాలు(భక్ష్యాలు) చేసిపెట్టు. బయట

అందమైన జ్ఞాపకం

విప్పారిన నా కళ్ళు ఏదో వింతను చూడబోతున్నాయి నా చుట్టూరా పరిసరాలను  ఆక్షేపణ లేకుండా వీక్షిస్తుంటే మనసు మాత్రం  గత జ్ఞాపకాల గురుతుల వెంట కవాతు చేస్తుంది తనతో...పుష్కర కాలపు పరిచయం కాదు కాదు నా ఎదలో నిండిన ప్రణయం నాతో నేను నాలో నేను మనసులో మాట్లాడుకునే వయసులో అనుకుంటా తొలిసారి విన్నాను ఓ అందమైన చరితార్థమైన పేరు ఆ పేరు విన్న వెంటనే...నాలో ముద్రించుకున్నది ఓ రూపం ఆ రూపాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా...! అనే ఉత్సాహం నాలో... మొదలైంది చూసి చూడగానే అనుకున్నా... నాతో...నేను సంఘర్షణ పడేలా చేసే ఈ అందాల రాక్షసి  నా ప్రణయ కావ్యాల్లో‌...కీర్తించబడే దేవత అని అప్పట్నుంచి తన నిదర్శన భాగ్యంతో... ఎప్పటికప్పుడు సరికొత్త ఉత్సాహం కలిగించేది ఇద్దరి వయసులు పెరిగే కొద్దీ మనసులు మరింత దగ్గరయ్యాయి తను చూపులతో...నా మది స్పృశిస్తుంటే నేను మాత్రం ఆ కన్నుల కదలికలో... నాపై దాచుకున్న కడలి అంత ప్రేమను ఆస్వాదించా మా మధ్య మాములు మాటలు తడబడుతుంటే మాలోపలి...భావాలు కవిత్వ రూపాన్ని పొందాయి తను దూరమై పోతుంది అనుకునే ప్రతి సారి మరింత దగ్గరయ్యేది...నా మది ఇంకా మురిసిపోయేలా నా అభిరుచులు తన యిష్టంగా మార్చుకుంది ఇద్దరం తరుచూ చూసుకోవడం