పోస్ట్‌లు

సెప్టెంబర్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

సమ్మోహనం

పాలిపోయిన ముఖవర్చస్సుతో వాలు కుర్చీలో వాలీపోయి అలసిన దేహంతో సందేహాలెన్నో తీరని నవయవ్వన మనస్సుతో...గతకాలపు జ్ఞాపకాల స్మృతుల తలంపుతో శేష జీవితాన్ని విశేషంగా ఆస్వాదించాలనుకున్న నాకు ప్రాయం పాతికకు చేరుకునే లోపు జరిగిన సంఘటనలు సంఘర్షణలు నా జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి నా పేరు అనంత్ కుటుంబం గురించి చెప్పుకునేంత గొప్పగా ఏంలేదు కాని జన్మనిచ్చిన తల్లిదండ్రుల గురించి  అక్షర జ్ఞానం నేర్పించిన గురువు గురించి ఎవరైనా చెప్పుకోకుండా ఉండలేరు కదా అందుకే  వాళ్ళను కూడా పరిచయం చేస్త అమ్మానాన్నలు కులవృత్తి ని నమ్ముకున్న జీవితాలు నాతో పాటు ఏడు మంది సంతానాన్ని పోషించే పేదలు  అందరిలో కెల్ల నేను పెద్దవాణ్ణి ఆ కాలంలో మా కుటుంబం లో చదువుకునే అదృష్టం నాకు మాత్రమే కలిగింది అది మా మేనత్తకు పిల్లలు లేని కారణంగా  నన్ను పెంచుకుని చదివిస్తా అని చెప్పి తనవెంట  తీసుకెళ్ళి ప్రాథమిక విద్య నేర్పించింది ఆలోపు తనకు కూతురు పుట్టడంతో మళ్ళీ నేను మా ఇంటికి వచ్చేశా ఇప్పటికి మళ్ళె నేను పలక బలపం పట్టుకుని ఓనమాలు నేర్చుకుని ఉంటే నా చదువు అక్కడితో ముగిసిపోయేదేమో కాని ఇసుకలో చేతివేళ్ళతో ఓనమాలు దిద్దిన కారణంగా చదువుపై మమకారం పెరిగింది