సమ్మోహనం

పాలిపోయిన ముఖవర్చస్సుతో
వాలు కుర్చీలో వాలీపోయి అలసిన దేహంతో సందేహాలెన్నో తీరని నవయవ్వన మనస్సుతో...గతకాలపు జ్ఞాపకాల స్మృతుల తలంపుతో శేష జీవితాన్ని విశేషంగా ఆస్వాదించాలనుకున్న నాకు ప్రాయం పాతికకు చేరుకునే లోపు జరిగిన సంఘటనలు సంఘర్షణలు
నా జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి

నా పేరు అనంత్
కుటుంబం గురించి చెప్పుకునేంత గొప్పగా ఏంలేదు
కాని జన్మనిచ్చిన తల్లిదండ్రుల గురించి 
అక్షర జ్ఞానం నేర్పించిన గురువు గురించి
ఎవరైనా చెప్పుకోకుండా ఉండలేరు కదా అందుకే 
వాళ్ళను కూడా పరిచయం చేస్త
అమ్మానాన్నలు కులవృత్తి ని నమ్ముకున్న జీవితాలు
నాతో పాటు ఏడు మంది సంతానాన్ని పోషించే పేదలు 
అందరిలో కెల్ల నేను పెద్దవాణ్ణి

ఆ కాలంలో మా కుటుంబం లో
చదువుకునే అదృష్టం నాకు మాత్రమే కలిగింది
అది మా మేనత్తకు పిల్లలు లేని కారణంగా 
నన్ను పెంచుకుని చదివిస్తా అని చెప్పి తనవెంట 
తీసుకెళ్ళి ప్రాథమిక విద్య నేర్పించింది
ఆలోపు తనకు కూతురు పుట్టడంతో మళ్ళీ నేను మా ఇంటికి వచ్చేశా

ఇప్పటికి మళ్ళె నేను పలక బలపం పట్టుకుని ఓనమాలు నేర్చుకుని ఉంటే నా చదువు అక్కడితో ముగిసిపోయేదేమో కాని ఇసుకలో చేతివేళ్ళతో ఓనమాలు దిద్దిన కారణంగా చదువుపై మమకారం పెరిగింది

మా ఊర్లో స్కూల్ లేదు పక్కన ఉన్న టౌన్ కి పంపే స్థోమత అమ్మానాన్నలకు లేదు అయినా కాని చదువుకోవాలనే నా పట్టుదలకు సరస్వతి మాత అనుగ్రహం లభించిందేమో

మా గురువు ఖాజా మొయినుద్దీన్ సలహా మేరకు  40 కిలోమీటర్ల దూరంలో ఉన్న టౌన్ లో చదువుకునేందుకు స్కూల్ తో పాటు ప్రభుత్వ హాస్టల్ వసతి కూడా ఉందని చెప్పడంతో  హైస్కూల్ విద్య కోసం ఆ టౌన్ కి వెళ్ళిన 

అక్కడకి వెళ్ళాక నా జీవితం అనుకోని మలుపులు తిరిగింది
ఒక పెద్దింటి అమ్మాయి పేదవాడి మనసును ఆకర్షిస్తే
ఆ పేదవాణ్ణి అయినా నన్ను ఆ అమ్మాయి తన గుండెల్లో  బంధించింది

ప్రేమాకర్షణకు పేద ధనిక తారతమ్యం తెలియదు అని
ఆనాది కాలం నుంచి ఉన్న నిజజీవిత సత్యం నా జీవితంలో నిజమైంది అని సంబరపడిపోయిన నేను 
చదువులో కూడా మేటిగా రాణించే వాణ్ణి

ఏ తరమైన కాని యువత 
యుక్తవయసులో ప్రేమకు ఎంత ఆకర్షితులవురో
అలాగే సమకాలీన పరిస్థితుల్లో సమాజం లో జరిగే విషయాలపై చర్చిస్తూ...మార్పు తీసుకరావాలనే 
ఒక విధమైన విప్లవ భావాలకు కూడా అలాగే ఆకర్షితులవుతారు అనే మాటకు నేను అతీతుడను కాలేకపోయాను నా మదిలో భావజాల సంఘర్షణ మొదలైంది

నేను ఎస్ ఎస్ ఎల్ సి (SSLC)  ప్యాసైన 
క్లాస్ లో అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న నాకు గురువుల అభినందనలు అందుకునే అదృష్టం దక్కింది 

అప్పుడు నాతో నా ప్రేయసి మాట్లాడిన మాటలు ఇప్పటికి నా మనసులో వినిపిస్తున్నాయి నా
ఆ మాటలు తను నాతో చెప్పినట్టుగానే

అనంత్ నీ అందమైన దస్తూరితో ఎన్ని ప్రేమలేఖలు అందుకుందో ఈ కస్తూరి 
అన్నిటిలో ఉన్న నీ మది భావాలు 
నా ఎదలోతుల్లో ఎప్పుడు పదిలంగానే ఉంటాయి
మన ఈ పరిచయం విడదీయలేని అనుబంధమై
మరో తరానికి వారధిగా నిలిచే భార్యాభర్తల్లా మాత్రమే కాకుండా గొప్ప ప్రేమికుల్లా నిలిచిపోవాలనుంది 
అని చెబుతూ....

అనంత్ మా ఫ్యామిలీ హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతుంది
నువ్ పై చదువుల కోసం అక్కడికే కదా వచ్చేది ఇకపై మన ప్రణయం భాగ్యనగరంలో సరికొత్తగా పరిచయం అవ్వాలనే నా ఆకాంక్షకు ఇదిగో నేను నీకు ఇస్తున్న నా అడ్రస్ అని చెప్పి హైదరాబాద్లో తను వుండబోయే చిరునామా పేపర్ చేతిలో పెడుతూ... నా మదిలో చెరగని తన జ్ఞాపకంలా నుదిటిపై ముద్దును బహుమానంగా ఇచ్చింది

ఆ మధుర సంతకంతో నా లలాట రేఖలు పూర్తిగా మారిపోయే స్థితి వస్తుంది అని కలలో కూడా ఊహించలేదు

నా SSLC సర్టిఫికేట్ తీసుకోక ముందే 
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం త్రీవంగా జరుగుతున్న కాలం అది ఉద్యమాన్ని అణచివేసే రాజకీయ పరిస్థితులపై ఎప్పటికప్పుడు తిరగబడుతున్న యువతలో నేను ఓ భాగమై హైదరాబాద్ వెళ్ళాను 

కస్తూరి ని కలవాలని తనని ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఆశతో భాగ్యనగరంలో అడుగుపెట్టిన నేను
స్నేహితుల వెంట ఉద్యమంలో పాల్గొంటునే నా కస్తూరి ఇచ్చిన చిరునామా పట్టుకుని తను ఉండే చోటుకి వెళ్ళకా తెలిసింది కస్తూరి హైదరాబాద్ రాలేదని 
నాకు ఇచ్చిన అడ్రస్ కూడా తప్పే అని

కస్తూరి ఇలా ఎందుకు  చేసింది అనే ఆలోచనతో
ఏం చేయాలో తెలియడం లేదు
అసలు నా భవిష్యత్తు ఆశలన్నీ ఆవిరైపోయేలా
కస్తూరి నామాన్నే జపిస్తూ....
మనసంతా కోపమో ప్రేమో తెలియని వేదనలా 
నాలో ఉన్న విప్లవ భావజాలం కాస్త ప్రేమ పై వితండవాదం చేస్తుందేమో....

కస్తూరి ని కలిసి ఎందుకు నన్ను మోసం చేశావని గట్టిగా నిలదీయాలని వుంది.కపట ప్రేమతో నాలో లేనిపోని ఆశలు కలిగించావని నాకు కలిగిన అసహన భావానికి తనని ఏం చేసినా తప్పు లేదని నిర్ణయానికొచ్చింది నా మనసు

నా స్నేహితులతో చెప్పకుండానే 
హైదరాబాద్ నుంచి మళ్ళీ టౌన్ కి బయలుదేరి వచ్చా
నేరుగా కస్తూరి ఇంటికి వెళ్ళి తనని నిలదీయాలని
నీకు నీవుగా నన్ను ప్రేమించానని చెప్పి ఇప్పుడు తప్పించుకోడానికి కారణం ఏంటనీ అడగాలని మదిలో పలుమార్లు అనుకుంటూనే తన ఇంటికి వెళ్ళా

తను ఇంట్లో ఒక్కతే ఉంది 
నన్ను చూడగానే ఇంట్లోకి లాక్కెలీ 
ఏంటీ అనంత్ ఎలా వున్నావ్ అని చెబుతూ..
తలుపులు వేస్తూ...అడిగింది

ఏంటీ కస్తూరి ఆ కంగారు 
నేను మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చాననా నీ డౌటు
లేక ఎలా వచ్చాననా అని అంటే 
అనంత్ నువ్ రావడానికి కారణమేంటో నాకు తెలుసు 
నువ్ ఆవేశంతో ఉన్నావ్ కాస్త కోపం తగ్గించుకో
అని నన్ను శాంతపరిచేందుకు ప్రయత్నిస్తుంది

ఏం వగలాడివే నా మానాన నేను ఉంటే 
ప్రేమ పేరుతో వెంటబడి చివరకు నన్ను వదిలించుకోడానికి ఎన్ని నాటకాలు ఆడుతున్నవ్ 
అని స్వరం పెంచి మాట్లాడుతున్నానే కాని 
మనసులో మాత్రం కస్తూరి నిను విడిచి బ్రతకలేనే నన్ను ఒంటరిని చేయొద్దు నాతోడుగా ఉండేవే అని తనని బ్రతిమిలాడుతున్న దుఃఖం తో

తను మాత్రం అనంత్ నీపై నాకున్న ప్రేమను నువ్ అనుమానిస్తుంటే తట్టుకోలేనురా...
నేను ఇలా చేయడానికి కారణం మాత్రం నువ్ బ్రతికుండాలనే 
మన ప్రేమ విషయం ఇంట్లో తెలిసింది 
నిన్ను నేను ప్రేమిస్తున్నాను అనే విషయం మీ ఫ్రెండ్ జీవన్ మా నాన్నకు చెప్పాడు 

జీవన్ నాకు బావ అని నీకు నేను చెప్పలేదు కదా
నా పెళ్ళి తనతోనే అని చిన్నప్పుడు అనుకున్నారట
అందుకే అతను మనం కలిసి ఉండటం చూసి తట్టుకోలేక ఇలా ఇంట్లో చెప్పాడు
నిన్ను కలిసి హైదరాబాద్ చిరునామా ఇవ్వమని చెప్పాంది కూడా జీవన్ నే మా నాన్న రాజకీయ వారసుడిగా జీవన్ ఉండాలని నన్ను పెళ్ళి చేసుకుంటానని ఎప్పుడు చెప్పేవాడు

మా నాన్న మాట కాదని నిన్ను ప్రేమిస్తే
నిన్ను చంపేస్తా అని నన్ను భయపెట్టారు
ఈ రోజు అందరూ కలిసి ఆ జీవన్ తో పెళ్ళి సంబంధం గురించి మాట్లాడటానికి మా వాళ్ళు అందరూ 
ఊరెల్లారు బహుశా వారంతా రేపు మధ్యాహ్నం రావొచ్చు ఈ రోజు రాత్రి నువ్ ఇక్కడే ఉండు
చుట్టుపక్కల వారు చూడకముందే 
మనం తెల్లవారుజామున మొదటి ట్రైన్ కి ముంబాయి వెళ్ళిపోదాం అని కస్తూరి చెబుతుంటే

నాకు మాత్రం అంతా సినిమా కథలా అనిపిస్తుంది
కస్తూరి నేను వినేది అంతా నిజమా 
ఇద్దరు ప్రేమికుల వెనుక ఇంత కుట్ర జరుగుతుందా అనుకునేది
అది కూడా నా జీవితంలో జరగడం ఇంకా నన్ను ఆందోళన కలిగిస్తోంది అని కస్తూరి తో అంటే
తను మాత్రం రేపు తెల్లవారితే మనం వారికి కనపడకుండా దూరంగా వెళ్తాం కదా అనంత్ నువ్ భయపడకు అని నాకు ధైర్యం చెబుతుందీ

ఆ రాత్రి ఇద్దరం కలిసి భోజనం చేశాక 
కస్తూరి మనం చేసేది కరెక్టే నా అనిపిస్తుంది 
ఇద్దరం కలిసి ఉండాలంటే దూరంగా పారిపోవాల్సిందేనా అని తనని అడుగుతుంటే
ఇక్కడే వుంటే కలిసి ఉండలేం 
ఒక వేళ ఇక్కడే కలిసి బ్రతుకుదాం అనుకుంటే 
మా నాన్న మనల్ని బ్రతకనివ్వడు అని చెప్పింది

రాత్రి పడుకునే ముందు
కస్తూరి నన్ను చూస్తూ...అనంత్ నువ్ ఆందోళనతో ఉన్నట్టున్నావ్ నీ ఆవేదనని నేను ఆనందంగా మార్చనా అంటే అదేలా సాధ్యం అని అడిగితే 
నువ్వు చదువులో మేటివి కాని సరసం తెలియని మొద్దువు అని ముద్దు పెడుతూ చెప్పింది

ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో అలాంటివి అవసరమా కస్తూరి అని అంటుంటే
భారమైన మనసులు తేలిక పడాలంటే
మనం ఒకరి బరువును మరొకరం మోయాల్సిందే 
అని తను నా ఎదపై వాలిపోయి చూడు అనంత్ 
నీ గుండె విరహంతో ఎంత విలవిలలాడుతుందో

ఒక్కసారి నా కళ్ళలోకి చూడు
ఇన్నాళ్ళు మూగ సైగలతో అల్లుకుపోయిన మనసులు
తనువులను ఏకం చేసి తపస్సు చేయమని చెబుతున్నట్టు లేదు 

కందిరీగ నడుమున్న కొంటెపిల్లవే అని కనుబొమ్మలెగరేస్తూ....చెప్పిన నీ మాటలకు
సిగ్గు పడిన నేను ఇప్పుడు నిసిగ్గుగా నీ ముందు ఉండి
నా నాజూకు నడుమొంపులను నీ చేతిలో పెట్టేశా...
ఇక నువ్ ఆటలే ఆడుకుంటావో...
శృంగార విందును ఆరగించలేని అసమర్థతో పస్తులే ఉంటావో నీ ఇష్టం అని నిద్రపోతున్న నా యవ్వనాన్ని రెచ్చగొట్టింది 

యవ్వనంతో ఉన్న కుర్రమనసుకు దివి నుంచి దిగివచ్చిన దేవతని చూస్తూ...ఆరాధించడమే అదృష్టం అనుకుంటే కోరకుండానే వరాన్ని ఇస్తుంటే 
కాదనకుండా ఉండగలమా

ఇన్నాళ్ళు అలంకరణల మధ్య దాచుకున్న తన సౌందర్య సౌభాగ్య సౌష్ఠవాన్ని నాకు సమర్పిస్తూ...
రసమయూరి పురివిప్పి నవభంగిమల్లో నాట్యమాడేలా అధరపు ఆలింగనాలతో...
ఒకరిపై ఒకరం ఎనలేని ప్రేమను ఒలకబోస్తూ....
రేరాజు వెన్నెల కాస్తున్న వేళ నా వెలుగునంతా తనలోకి ప్రసరింపజేసి కుదుపులు లేని తన కుచద్వయంపై 
పసివాణ్ణై పవలించిన నాకు తెల్లారి నాలుగు గంటల జామున మెలకువ వచ్చి కస్తూరి ని నిద్రలేపి 
ఇద్దరం హడావుడిగా ఇంట్లోంచి బయలుదేరి రైల్వే స్టేషన్ కి వచ్చాము

అక్కడ అనుకున్న టైంకు ట్రైన్ ఎక్కాలని
తొందరగా ఆందోళనగా ఉన్న నాకు జీవన్ కనిపించాడు
నేను జీవన్ అని పిలిచి తనతో మాట్లాడాలని చూసే లోపు వెనుక నుంచి తలపై ఎవరో గట్టిగా కొట్టడం కస్తూరి అనంత్ అని అరవడంతో...నాతో ఆవేశం కట్టలు తెంచుకుంది

జీవన్ వెంట ఉన్న వాళ్ళని కొట్టే సత్తా నాకు లేకపోవచ్చు కానీ వాళ్ళతో తన్నులు తినే లోపు ఆ జీవన్ ను ఎలాగైనా అడ్డుకోవాలని అవసరం అయితే వాణ్ణి కోలుకుండా దెబ్బలు కొట్టాలని అక్కడ ఉన్న ఒక ఇనుప రాడ్డు తో జీవన్ తలకేసి బలంగా కొట్టగానే
అక్కడికక్కడే కుప్పకూలీ పోయాడు అదంతా చూసి జీవన్ వెంట వచ్చిన వాళ్ళు పారిపోయారు

నేను వెంటనే కస్తూరి మనం పోదాం పద అని తన చేయి పట్టుకుని తీసుకెళ్దాం అనుకుంటే కస్తూరి నా చేతిని విడిపించుకుని అనంత్ నువ్ ఏం చేశావో తెలుస్తుందా ... మా బావని హత్య చేశావ్ 

ఈ విషయం తెలిస్తే నిను పోలీసులు పట్టుకోవడం ఏమో కానీ
మా నాన్న కు తెలిస్తే నిను చంపకుండా ఉండడు
ముందు నువ్ ఇక్కడినుంచి వెళ్ళిపో....
ఎవరూ చూడకముందే అని
నన్ను అక్కడున్న ట్రైన్ ఎక్కించింది

నేను కస్తూరి నువ్ లేకుండా బతకలేను వచ్చేయ్ అని అంటుంటే
ముందు నువ్ బ్రతకాలి అనంత్ 
మనిషికి ప్రాణం కన్న ఎక్కువ ఏదీ కాదు
నువ్వు వెళ్ళిపో అని నన్ను ఓ హంతకునిలా
పారిపోమని చెప్పి  పంపించేసింది
హత్య చేసిన అపరాధ భావంతో 
ట్రైన్ లో కూర్చున నేను ఎక్కడ దిగానో కూడా తెలియకుండా
ఏ ఆలోచనలు లేకుండా రోడ్ల వెంట ఎన్ని కిలోమీటర్ల దూరం నడిచానో కూడా తెలియదు

దీన పరిస్థితి లో ఉన్న నన్ను చూసిన లారీ వాళ్ళు 
తమతో రమ్మని చెప్పి వారి వెంట తీసుకెళ్ళారు
అలా లారీ క్లీనర్ గా ఓ సంవత్సరం పాటు చేసాకా
మళ్ళీ నా గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తొచ్చే సరికి
ఇంటికి తిరిగి వచ్చా

కానీ మనసంతా కస్తూరి కోసం 
తపించి పోతుంది కస్తూరి ని చూద్దాం అని 
తను వుండే చోటుకి వెళ్తే అప్పటికే తనకు పెళ్ళైందని తెలిసింది
నా దురదృష్టం ఏంటంటే తన పెళ్ళైంది జీవన్ తో

అంటే జీవన్ చనిపోలేదా...
మరి నేనెందుకు పారిపోయా
అని నాపై నాకే తెలియని ఓ ఆవేశంతో నన్ను నేను నిందించుకుంటూ... ఉండగా

నేను ఆ రోజు రైల్వే స్టేషన్ లో జీవన్ ని కొట్టడంతో 
తను చనిపోలేదు కానీ స్పృహ తప్పి పడిపోయాడని
తిరిగి తర్వాత కోలుకున్నాక కస్తూరి తో పెళ్ళి జరిగిందని తెలిసిన 
వారి ద్వారా తెలుసుకుని

నా జీవితంలో ఆవేశం అనే దానికి చోటు లేదని
అసలు కస్తూరి అనే ప్రేమకు హృదయం లో స్థానం లేదని
నిర్ణయించుకున్న 

కానీ యవ్వనం చేసే గాయాలు ఎన్నో
జీవితంలో మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ
ఒక్కోసారి బాధగాను ఇంకోసారి ఆనందాన్ని కలిగించేలా
జానకీ,వాణి,భారతి నా జీవితంలోకి 
వచ్చి నన్ను సమ్మోహన వర్షంలో తడిపేలా చేసి
ఆనందమైన వేళ విరహాన్ని బహుమానంగా ఇచ్చి వెళ్ళారు

వీళ్ళలో ఏ ఒక్కరితో నో నా జీవితం ముడిపడి ఉంటే
ఈ నా కథ మరోలా ఉండేదేమో అనిపిస్తుంది 
కానీ వీళ్ళందరిని మరిపించిన నా సుశీ 
విరహంపై విరక్తి కలిగిలే చేసి నన్ను సంతోషపెడుతూ
తను ఆనందం పొందుతుంది అనే సంతృప్తి నా ప్రేమ జీవితం లో ఉంది అనుకుంటున్న

ఆ తర్వాత నా చదువు తగ్గ గుమస్తా ఉద్యోగం తో జీవితంలో అనుక్షణం ఆనందం అనుభవిస్తూ....
ఆవేదనతో ఉన్న నా జీవితాన్ని ఆనందంగా మార్చేసిన
నా సహచరి సుశీలతో....నా యవ్వన తప్పిద ప్రేమను
కళ్ళు చెమర్చేలా అప్పుడప్పుడు ఇలా 
ఎన్ని సార్లు చెప్పిన పిచ్చిది నాపై ప్రేమ తో 
ఆ కస్తూరి కి నిన్ను చేసుకునే అదృష్టం లేదండి
అని చెబుతూనే ఉంటది

అన్నట్టు సుశీ మనం మళ్ళీ పెళ్ళి చేసుకుందామా 
అని అడిగితే ఏం పని లేదు మీకు వయసు పైబడ్డాక
మళ్ళీ పెళ్ళి ఏంటీ నువ్వు నీ.....
అని ప్రేమతో తిడుతుంటే
అదే అప్పట్లో మన పెళ్ళి మన తల్లితండ్రులు చేస్తే
ఇప్పుడు మళ్లీ మన పిల్లలు చేస్తారట 
చేసుకుందామే అందరు ఓ మారు కలిసినట్టు ఉంటుంది
మన కోసం కాకపోయినా అందరం కలవాలనే ఆశ కోసమైనా చేసుకుందాం అని నేను చెప్పగానే సుశీ
పోండి మీరు మరీను అని మా పెళ్ళి జరిగిన తొలినాళ్ళ రోజుల్ని గుర్తుతెచ్చాలా సిగ్గుపడుతూ.....ఉంది





 


















కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

August 12th

ఎప్పుడు చూశానో