పోస్ట్‌లు

జులై, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

మనసైనోడు

నిత్యం నన్ను చూస్తే... తనలో తాను తపించి తరించిపోయే  నవ యవ్వన మనస్కుడు నాకై...తనతో తాను సంఘర్షణ పడుతూ నిరంతరం తన అంతరంగాన నన్నే అన్వేషిస్తున్న చెలికాడు నన్నో...దేవతలా తలిచి  తన హృదయంలో కొలిచి నా అపూరూప దర్శనానికై ప్రతి క్షణం ఎదురుచూసే సఖుడు నా కోసం తనని తాను మార్చుకొని నాలోని పసితనానికి తనలోని కొంటెతనంతో పరిపక్వత చేకూర్చే ప్రియుడు ఎక్కడ వున్నాడో... ఏం చేస్తున్నాడో... ఎప్పుడు కలుస్తాడో... ఎలా నన్ను వరిస్తాడో... అని పరిపరి విధాల ఆలోచనలు చేస్తూ... కొన్ని కవన పదాలను లిఖిస్తూ... నాకు నచ్చిన వాడు ఎక్కడున్నాడో అనుకుంటూ... ఆలోచనలో లీనమై పోయా...అదే ప్రేమ ఊహలో బిజీ గా మారిపోయా. నా పేరు కీర్తి (శృతకీర్తి) "నేను అందర్లాంటి అమ్మాయిని కాదు...నేనో స్పెషల్" అనేది నా ఫీలింగ్. ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుందిలే "ఎవరికి వారు ప్రత్యేకం అనుకోకపోతే...వాళ్ళలో మరో... బుద్ధుడు ఉన్నాడనో లేక బుద్ధిలో కొంచెం తెలివి ఎక్కువ తక్కువల ప్రవాహంతో మన సాధారణ ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయనో" ఫిక్స్ అవ్వాలి సుమా..! ప్రతి రోజూలానే ఇవాళ కూడా కాలేజీకి వెళ్ళెందుకు ఫ్రెండ్స్ తో కలిసి కాలేజీ బస్సులో ప్రయాణిస్తున్న  ...