పోస్ట్‌లు

మార్చి, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

ఎప్పుడు చూశానో

నన్ను నేను ఎక్కడని వెతకాలి ఏ కన్నె మనసు నన్ను తనలో దాచుకుందో  నాలో మాత్రం నేను లేనని స్పష్టంగా తెలుస్తుంది అప్పుడు తనకై ఆలోచిస్తుంటే అదే నన్ను నేను వెతికే వేళ తెలిసింది ఎప్పుడు చూశానో తెలియదు కానీ ఎప్పుడూ చూస్తున్నట్టే ఉంది కళ్ళలో నిక్షిప్తం చేసుకున్నానో మనసులో దాచుకున్నానో తెలియదు కానీ ఆకాశ తారల తీరుగా కనిపిస్తూ కనువిందులు కల్గించేలా...ఉంది రూపం రాత్రంతా నాతో ఉన్నా కానీ పొద్దున లేవగానే తననే చూడాలి అనిపిస్తుంది అందుకే కనుల తెరలపై ఉన్న తనని మనసు పొరలలో పదిలం చేసుకున్న నా తోడుగా తను లేదని తెలిసి నా నీడలోనే చూస్తూ ఊహల్లో తనతో విహరిస్తున్న మనసుకు అనిపిస్తూనే... ఉంది చరవాణి తెరపై ఉన్న తనని నా ఎద పూల పాన్పుపై సేదతీరేలా  నా కలలన్ని నిజమమ్యేలా నన్ను నేను మరో మనసులో...కనుగొంటానని

ఫోటో పై కవిత

చిత్రం
  ద్వీపాంతరంలో నల్లని కురులతో విరుల తోరణం మధ్యలో సేదతీరుతుంటే అందాల సంభ్రమాశ్చర్యాల స్వర్గపుటంచుల్లో ఉన్నట్టుంది కదలాడే...స్పష్టమైన ప్రతిబింబాల మధ్యన నేనో...ప్రతిమనై నిలిచిపోయానేమో నీరంతా...నీలాకాశంతో కలిసినట్టు అగుపించే... అద్భుత సమయనా ఏకాంత వేళ తారా కాంతలతో... సంగమించే చంద్రుని వంక వీక్షిస్తూ... ఊహా లోకాన విహరిస్తున్నానేమో నన్నే నే మరచిపోయి... అందాల్లో కలిసిపోయిన అంగనలా అభిసారికనై ఎదురు చూస్తున్నాను 

నేటి సమాజం

నేటి సమాజం స్వేచ్ఛా సంకెళ్ళ వలలో బంధీ అయిపోతుంది ఉరుకుల పరుగుల జీవన వేగంలో ప్రేమానురాగాలు నెమ్మదించేలా హాయ్ హలో అంతకుమించని ఆప్యాయతలతో బంధాలు బలహీనమవుతున్నాయి బంధుత్వాలు సుదూర తీరాలవుతున్నాయి నేటి సమాజంలో 'టెక్'నాలజీ నాలెజ్డికి వాక్ చాతుర్యపు మాయకి సామాన్యుడు దోచుకోబడుతుండు వ్యవస్థాగత మార్పులతో ఇంకా వెనకబడుతుండు సంపన్నుల పన్ను ఎగవేతను ప్రశ్నించలేని అధికారం పేదోడి పై హుకుం చలాయిస్తూనే పైసలున్నోడికి ఊడిగం చేస్తుంది నేటి సమాజం మోసం చేసేవారికి మోకరిల్లుతుంది నయవంచన చేసెటోడికి సేవకుడిగా మారుతుంది నిజాయితికి నిలువ నీడలేకుండా చేస్తునే మంచితనాన్ని మరుగున పడేలా చేస్తుంది దోచుకునే దొంగలను దొరలుగా మలచి బక్కచిక్కిన రైతును బడుగు జీవులను బ్రతకకుండా చేస్తుంది నేటి సమాజం కల్తీగా మారి నాణ్యతనే నమ్మలేనట్టు గా వుంది దో నెంబర్ మాల్ దందాతో దోఖా యిస్తూ డూప్లి కేటుగాళ్ళతో అనునిత్యం అవమానపడుతుంది నకిలీ నాజూకుతో అసులు సరుకుపై అనుమానం తెస్తుంది కలియుగపు మధ్యవర్తుల యుగంగా మారిపోయింది నేటి సమాజం అద్భుత మాయల నగార జీవితం అలసిపోని చమట చుక్కల శరీరం