ఫోటో పై కవిత
ద్వీపాంతరంలో
నల్లని కురులతో
విరుల తోరణం మధ్యలో సేదతీరుతుంటే
అందాల సంభ్రమాశ్చర్యాల
స్వర్గపుటంచుల్లో ఉన్నట్టుంది
కదలాడే...స్పష్టమైన ప్రతిబింబాల మధ్యన
నేనో...ప్రతిమనై నిలిచిపోయానేమో
నీరంతా...నీలాకాశంతో కలిసినట్టు
అగుపించే... అద్భుత సమయనా
ఏకాంత వేళ తారా కాంతలతో...
సంగమించే చంద్రుని వంక వీక్షిస్తూ...
ఊహా లోకాన విహరిస్తున్నానేమో
నన్నే నే మరచిపోయి...
అందాల్లో కలిసిపోయిన అంగనలా
అభిసారికనై ఎదురు చూస్తున్నాను

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి