పోస్ట్‌లు

మార్చి, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

దోస్త్

చిత్రం
తీపి,పులుపు,వగరు కారం,చేదు,ఉప్పు అనే షడ్రుచుల సమ్మేళనంలా  జిందగీలో ఎదురయ్యే అనుభవాలు సుఖం దుఃఖం, కష్టం నష్టం, బాధ సంతోషం  మనసులో కలిగే ఉద్వేగాలు స్నేహం మోహం వ్యామోహం ప్రేమ ఆప్యాయత అనురాగం విరక్తి వైరాగ్యం లాంటి వాటి వల్ల ఆందోళననో, ఆనందమో... ఏదైనా సరే స్వీకరిస్తూ...జీవనయానం సాగిపోవాలని  తెలిపే...అర్థవంతమైన తత్వమే... ఉగాది పచ్చడి విశిష్టత  అలాంటి మనస్తత్వం కలిగిన మా మనసుల సమ్మేళనంలో మర్చిపోలేని...అనుభవాలు  గుర్తుండిపోయే...క్షణాలు  సంతోషపడిన...సమయాలు  ఎప్పటికప్పుడు నూతనంగా రూపుదిద్దుకునే మా జిందగీ ఎవరికి అర్థం కాని పరిచయం వేరే ఎవరితోను పోలిక లేని స్నేహం అహం అణువంతయిన కానరాని దోస్తాన్ వేర్వేరు లక్ష్యాలున్న... ఉమ్మడి ప్రణాళికల కలిగిన అభ్యర్థులం ఉద్యోగార్థులం  ఒక్కొక్కరు‌... ఒక్కో తీరుగా సంతోషం సొంతమైన వాళ్ళం  ఫిల్టర్ లేని మాటలతో... ఫిలాసఫీకల్ గా మాట్లాడుకునే మనుషులం జాతి రత్నాలం😜 ఉగాది పచ్చడిలో రుచిలా... అందరం కలిసి ఎంజాయ్ చేస్తున్న సోపతులం  హ్యాపీ ఉగాది 😋🥳

ఉగాది శుభాకాంక్షలు

కాలం వేగిరమై కదలిపోతుంటే క్రోధి నామ సంవత్సరం అమాంతం దూరమైపోయింది గడిచిన రోజుల స్మృతులన్ని బాధ్యతల్ని పెంచినా బాధల్ని మిగిల్చినా రేపటికై మన మంచికే అనుకుందాం కాలం చేసే విచిత్రాలలో... మోడుబారిన శిశిరం చింతించేలా చేసినా చిత్రంగా ఛైత్రం మన ముందుకొస్తూ పర్వదినమైన యుగాదిని తెస్తూ బోసిపోయిన తరువులకు చిగురాకులను వరముగా యిస్తూ వసంత ఋతువుతో మనసంతా  ఆశలు చిగురించి ఆలోచనలన్ని ఆశయాలుగా మారుస్తూ... మనసుకు ఎనలేని సంతోష సౌభాగ్యాల్ని ప్రసాదిస్తూ... షడ్రుచుల సమ్మేళితమైన జీవనాన్ని అవగాహనతో ఆలోచనాత్మక ఆనందంతో... సాగిపోవాలని ప్రకృతి నేర్పే సంప్రదాయిక పాఠమే ఈ ఉగాది... # విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు💐