ఉగాది శుభాకాంక్షలు
కాలం వేగిరమై కదలిపోతుంటే
క్రోధి నామ సంవత్సరం అమాంతం దూరమైపోయింది
గడిచిన రోజుల స్మృతులన్ని
బాధ్యతల్ని పెంచినా
బాధల్ని మిగిల్చినా
రేపటికై మన మంచికే అనుకుందాం
కాలం చేసే విచిత్రాలలో...
మోడుబారిన శిశిరం చింతించేలా చేసినా
చిత్రంగా ఛైత్రం మన ముందుకొస్తూ
పర్వదినమైన యుగాదిని తెస్తూ
బోసిపోయిన తరువులకు
చిగురాకులను వరముగా యిస్తూ
వసంత ఋతువుతో మనసంతా
ఆశలు చిగురించి
ఆలోచనలన్ని ఆశయాలుగా మారుస్తూ...
మనసుకు ఎనలేని సంతోష సౌభాగ్యాల్ని ప్రసాదిస్తూ...
షడ్రుచుల సమ్మేళితమైన జీవనాన్ని
అవగాహనతో ఆలోచనాత్మక ఆనందంతో...
సాగిపోవాలని ప్రకృతి నేర్పే సంప్రదాయిక పాఠమే ఈ ఉగాది...
# విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు💐
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి