ఎప్పుడు చూశానో

నన్ను నేను ఎక్కడని వెతకాలి
ఏ కన్నె మనసు నన్ను తనలో దాచుకుందో 
నాలో మాత్రం నేను లేనని స్పష్టంగా తెలుస్తుంది
అప్పుడు తనకై ఆలోచిస్తుంటే
అదే నన్ను నేను వెతికే వేళ తెలిసింది

ఎప్పుడు చూశానో తెలియదు కానీ
ఎప్పుడూ చూస్తున్నట్టే ఉంది
కళ్ళలో నిక్షిప్తం చేసుకున్నానో
మనసులో దాచుకున్నానో తెలియదు కానీ
ఆకాశ తారల తీరుగా కనిపిస్తూ
కనువిందులు కల్గించేలా...ఉంది రూపం

రాత్రంతా నాతో ఉన్నా కానీ
పొద్దున లేవగానే తననే చూడాలి అనిపిస్తుంది
అందుకే కనుల తెరలపై ఉన్న తనని
మనసు పొరలలో పదిలం చేసుకున్న

నా తోడుగా తను లేదని తెలిసి
నా నీడలోనే చూస్తూ
ఊహల్లో తనతో విహరిస్తున్న
మనసుకు అనిపిస్తూనే... ఉంది
చరవాణి తెరపై ఉన్న తనని
నా ఎద పూల పాన్పుపై సేదతీరేలా 
నా కలలన్ని నిజమమ్యేలా
నన్ను నేను మరో మనసులో...కనుగొంటానని

కామెంట్‌లు

  1. కలను కనేహక్కు కన్నె వయస్సు సొంతం కదా!

    మదిని నిపంపుకున్న మొహనాంగి చరవాణి లొ చూడనేలా హృదయఫలకం లొ ముద్రింపపడిన జాణ కదూ!!

    చాలా చాలా బాగుంది మనసుకి హత్తుకునేలా 👏

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

August 12th