నేటి సమాజం
నేటి సమాజం
స్వేచ్ఛా సంకెళ్ళ వలలో బంధీ అయిపోతుంది
ఉరుకుల పరుగుల జీవన వేగంలో
ప్రేమానురాగాలు నెమ్మదించేలా
హాయ్ హలో అంతకుమించని ఆప్యాయతలతో
బంధాలు బలహీనమవుతున్నాయి
బంధుత్వాలు సుదూర తీరాలవుతున్నాయి
నేటి సమాజంలో
'టెక్'నాలజీ నాలెజ్డికి
వాక్ చాతుర్యపు మాయకి
సామాన్యుడు దోచుకోబడుతుండు
వ్యవస్థాగత మార్పులతో ఇంకా వెనకబడుతుండు
సంపన్నుల పన్ను ఎగవేతను
ప్రశ్నించలేని అధికారం
పేదోడి పై హుకుం చలాయిస్తూనే
పైసలున్నోడికి ఊడిగం చేస్తుంది
నేటి సమాజం
మోసం చేసేవారికి మోకరిల్లుతుంది
నయవంచన చేసెటోడికి సేవకుడిగా మారుతుంది
నిజాయితికి నిలువ నీడలేకుండా చేస్తునే
మంచితనాన్ని మరుగున పడేలా చేస్తుంది
దోచుకునే దొంగలను దొరలుగా మలచి
బక్కచిక్కిన రైతును బడుగు జీవులను బ్రతకకుండా చేస్తుంది
నేటి సమాజం
కల్తీగా మారి నాణ్యతనే నమ్మలేనట్టు గా వుంది
దో నెంబర్ మాల్ దందాతో దోఖా యిస్తూ
డూప్లి కేటుగాళ్ళతో అనునిత్యం అవమానపడుతుంది
నకిలీ నాజూకుతో అసులు సరుకుపై అనుమానం తెస్తుంది
కలియుగపు మధ్యవర్తుల యుగంగా మారిపోయింది
నేటి సమాజం
అద్భుత మాయల నగార జీవితం
అలసిపోని చమట చుక్కల శరీరం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి