మనసైనోడు
నిత్యం నన్ను చూస్తే...
తనలో తాను
తపించి తరించిపోయే
నవ యవ్వన మనస్కుడు
నాకై...తనతో తాను
సంఘర్షణ పడుతూ
నిరంతరం తన అంతరంగాన
నన్నే అన్వేషిస్తున్న చెలికాడు
నన్నో...దేవతలా తలిచి
తన హృదయంలో కొలిచి
నా అపూరూప దర్శనానికై
ప్రతి క్షణం ఎదురుచూసే సఖుడు
నా కోసం
తనని తాను మార్చుకొని
నాలోని పసితనానికి
తనలోని కొంటెతనంతో
పరిపక్వత చేకూర్చే ప్రియుడు
ఎక్కడ వున్నాడో...
ఏం చేస్తున్నాడో...
ఎప్పుడు కలుస్తాడో...
ఎలా నన్ను వరిస్తాడో...
అని పరిపరి విధాల ఆలోచనలు చేస్తూ...
కొన్ని కవన పదాలను లిఖిస్తూ...
నాకు నచ్చిన వాడు ఎక్కడున్నాడో అనుకుంటూ... ఆలోచనలో లీనమై పోయా...అదే ప్రేమ ఊహలో బిజీ గా మారిపోయా.
నా పేరు కీర్తి (శృతకీర్తి)
"నేను అందర్లాంటి అమ్మాయిని కాదు...నేనో స్పెషల్"
అనేది నా ఫీలింగ్. ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుందిలే "ఎవరికి వారు ప్రత్యేకం అనుకోకపోతే...వాళ్ళలో మరో... బుద్ధుడు ఉన్నాడనో లేక బుద్ధిలో కొంచెం తెలివి ఎక్కువ తక్కువల ప్రవాహంతో మన సాధారణ ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయనో" ఫిక్స్ అవ్వాలి సుమా..!
ప్రతి రోజూలానే ఇవాళ కూడా కాలేజీకి వెళ్ళెందుకు ఫ్రెండ్స్ తో కలిసి కాలేజీ బస్సులో ప్రయాణిస్తున్న
నా ఫ్రెండ్స్ వాణి మరియు ఉమ వాళ్ళతో నేను ఎంత క్లోజ్ అంటే...పైన రాసుకున్న ప్రణయ భావనలు ఉన్నాయే వాటిని వాళ్ళతో షేర్ చేసుకుని మురిసిపోతూ ఉంటే... వాళ్ళ వాహ్హ్ వా వాహ్హ్ వా కీర్తి నువు తోపే...నీ కవితలు వింటుంటే ఈ క్షణమే "నేను మగాడినైతే నీ ప్రేమను యాక్సెప్ట్ చేసి ముద్దు పెట్టుకోవాలని ఉంది".కానీ నువ్వు ఫీల్ అవుతావ్ అని ఆగాను అని ఉమ తెగ ఫీలైతుంది.
ఛీ...ఛీ... ఏంటే
నా ప్రేమ నీలాంటి దానికి కాదే !
"మా వోడు ఎక్కడ వున్నాడో వాడికే అన్ని...కవితలైనా కవ్వింపులైనా "అని నేను మళ్ళీ పోయెట్రి ఫాంటసీలోకి వెళుతున్న .
ఏంటే కవ్వింపులా అదేంటే చదివింపుల మాదిరి అలా అనేశావ్ అని వాణి నోరెళ్ళబెట్టి అడిగింది.
ఒసేయ్ ముందు నువ్వు అలా నోరెళ్ళబెట్టి ముందుకు వచ్చి అడగటం మానేయ్ ..."ఎవడైనా తలతిక్క వెధవ ముందు ఇలానే నీ ప్రదర్శన ఉంటే అమాంతం నోరు మూసేస్తాడు వాడి నోరుతో" అని ఉమ వాణికి మొట్టికాయ వేస్తూ చెప్పింది.
నేను నవ్వుతూ...అవునే వాణి నీకు ఇదేం అలవాటే మనిషి దగ్గరగా వచ్చి ముఖం దగ్గరికి మూతి దగ్గరకు వచ్చి మాట్లాడతావ్ అని అడిగా..
దానికి...అది బుంగమూతి పెట్టి మీరెప్పుడు ఇంతే అబ్బా... మీతో మాట్లాడను పోండే అని ముఖం పక్కకు తిప్పుకొని కూర్చుంది.
ఏ...ఏ...వాణి నీ గుండెలోని గురుడు బస్ ఎక్కే స్టేజి వచ్చింది అందుకే అటు వైపు మళ్ళీ చూస్తున్నవ్ కదా తెలుసులేవే...నీ "ఎక్ ఓర్ ఇష్క్" అని ఉమ అంటుంటే...ఏంటే నీ ఓర్...ఒర్లుడు తలతిక్కదాన అని వాణి కసురుకునేలా చూసింది.
ఒసేయ్ వాణి "ఏక్ ఓర్ ఇష్క్" అంటే..."వన్ సైడ్ లవ్ అని దానికి వచ్చి రాని హిందీ లో చెప్పిందే" దీని మాటలకు నువు ఫీల్ కావద్దు బేబీ "నీ ఇష్క్ వీరుడు ఎంట్రీ ఇస్తుండు.
వాడి దిక్కు ఓ లుక్ వేయ్ నీ లక్ ని చూసుకో...అని నేను వాణిని ఆటపట్టిస్తున్న...
ఒసేయ్ ఎంకమ్మ దాని కన్నా నువ్వే ఎక్కువ ఏడిపిస్తున్నవ్ ! అని మళ్ళీ బుంగమూతి పెట్టింది వాణి.
ఓసి...దీని వేశాలో ...ఉన్నది చెబితే నీకు అంత అది ఎందుకు బేబీ (వాణి) నీ మనసులో మాట నువు చెప్పవు వాడినే తలుస్తు తెగ ఫీలైతవు వాడి ప్రస్తావన వస్తే మెలికలు తిరుగుతవ్ ఏంటే...నీ ప్రేమ ! నేను వెళ్ళి చెప్పనా...వాడికి "రేయ్ వీరు మా దోస్తీ వాణి నిన్ను ప్రేమిస్తుంది "అని నేను అడిగాను.
వద్దే తల్లి నా ప్రేమను నేనే చెప్త నువ్వేళ్ళి చెడగొట్టకు నీకో దండం కాసేపు సప్పుడు చేయకు ప్లీజ్ అంటుంది.
ఇంతకీ ఎప్పుడు చెప్తావే నీ ప్రేమను వీరతో అని ఉమ అడిగింది.
నా ప్రేమ గురించి నీకెందుకే అంత ఆత్రుత టైం వచ్చినప్పుడు చెప్తా నువ్వు గమ్మునుండవే.
మీ జీవితంలో ప్రేమలు రావా నేను ఏడిపించక పోతానా అని వాణి నోట్లో గొణుక్కుంటూ అనుకుంది.
ఓయ్ బేబీ నేను నీలా కాదే "నాకు నచ్చినోడు కనిపిస్తే సచ్చినోడా నాకెందుకు ఇంత నచ్చావ్ రా" !
నువ్వు "నాకు ఐ లవ్ యూ ఎప్పుడు చెప్తున్నవ్" అని వాడిని నీ స్టైల్ లో "ముఖం మీదకి ఒంగి నోటి దగ్గర మౌనపు భాషలో గట్టిగా మాటల్లో వాడికి మాత్రమే వినిపించేలా ప్రపోజ్ చేస్త" గురుడు ఒక్కసారి ఒళ్ళంతా తడిసిపోయి నన్ను మనసులోకి లాక్కోవాలి . అని మళ్ళీ దానికి అర్థం కాని కవిత్వ భాషలో చెప్పేశా.
ఏమోనే నువు నీ కవితల పిచ్చి
భలే దొరికారు ఇద్దరు నా దోస్తులుగా బాగా ఆడుకుంటున్నారే...అని ఏదో అనబోయింది.
ఎహే ఆపు నీ గోల కాలేజీ వచ్చింది దిగు ముందు అని ఉమ కసురుకుంది...
ఉమ ఎందుకే దాన్ని అలా అంటావ్ అది మన దోస్త్ కదా అలా అనొచ్చా అని నేను అన్నాను...
అబ్బో చెప్పొచ్చిందమ్మ సూక్తులు నువ్వే కదే దాన్ని ఆటపట్టించేది మళ్ళీ నన్ను అంటావ్ అంటూనే... కీర్తి ఇవాళ శుక్రవారం కదా కొత్త సినిమా రిలీజ్ అయితుంది. ఆఫ్టర్నూన్ వెల్దామా అని వాణి వైపు చూస్తూ నన్ను అడిగింది ఉమ.
నేరుగా కీర్తినే అడగకుండా నన్ను చూస్తూ అడగుతావేందే మెంటల్ నేను ఎప్పుడైనా వద్దు అన్నానా...అని వాణి ఉమతో అంటుంది.
నేను అది కాదే సినిమా అంటే.... ఇంట్లో తెలిస్తే...బాగోదు మీరు వెళ్ళండి నేను రాను అని చెప్పిన.
ఏంటే ఓ పెద్ద ధైర్యం ఉన్నట్లు నటిస్తవ్ .
సినిమా అనే సరికి ఇంట్లో తిడతారు అని భయపడ్తవ్ నువు ఎప్పుడు ఇంతే...పోవే అని ఇద్దరు నా వైపు అదోలా చూశారు.
సరే వెళ్దాం కానీ మధ్యాహ్నం సిఎస్(కంప్యూటర్ సైన్స్) సబ్జెక్ట్ క్లాస్ ఉంటుది మరియు ల్యాబ్ కి వెళ్ళాల్సి ఉంటుంది కదా సో 11 కే వెళ్దాం మధ్యాహ్నం 2 వరకు వచ్చేయొచ్చు ప్లీజే ఏం అనుకోండి అని రిక్వెస్ట్ చేశా.
అబ్బో...తమరు వచ్చేదే ఎక్కువ అనుకుంటే అందులో కండిషన్స్ కూడానా సరేలే ఎప్పుడైతే...ఏంది సినిమాకి పోవడం ముఖ్యం అని ఉమ నా వైపు ఓ లుక్కు వేసింది.
ఇంకో వన్ అవర్ క్లాస్ విని వెళ్దాం పద అని నేను అనేసరికి
సరే పోదాం పదా నువు నీ సరసు భక్తి అని వాణి అన్నది.
అదేంటే సరసు భక్తి అని ఉమ అడిగింది.
అదేనే సరసు అంటే సరస్వతి అని చదువు అని అందుకే అలా చెప్పిన అని వాణి నవ్వుతుంది...
ఇంకెప్పుడూ ఇలా explain చేయకే అర్థం కాకున్నా అర్థం అయ్యినట్టు నటించడం మా వల్ల కాదు అని ఉమ నవ్వింది.
సరే లే ముందు క్లాస్ కి వెళ్దాం
క్వార్టర్ టూ లెవన్ కి బయటికి వచ్చి సినిమాకి వెళ్దాం అని చెప్తూ క్లాస్ లోకి వెళ్ళాం.
ఎప్పుడెప్పుడు క్లాస్ అవుతుందా...! అని వాచీ వైపే చూస్తూ కూర్చున్నారు ఉమ మరియు వాణి.
టైం అయ్యింది పోదాం పదా...!
మళ్ళీ గ్యాప్ ఇస్తే మ్యాథ్స్ సర్ వస్తాడు అని వాణి తొందర పెడుతుంది...
ఒసేయ్ మెంటల్...
ఇవాళ మ్యాథ్స్ సర్ క్లాస్ కి రాడు
నాకు ముందే తెలుసు
మనం వెళ్లి బయట పని ఉంది ఆఫ్టర్నూన్ 2 కి వస్తాం అని ప్రిన్సిపాల్ ను అడుగుదాం పదా అన్నాను నేను.
వామ్మో...
ఇదేందే ప్రిన్సిపాల్ ముందు అడ్డంగా బుక్ చేసేలా ఉంది.
సినిమా వద్దు ఏం వద్దు నేను రాను బాబోయ్ అని వాణి భయంతో వెనక్కి వెళ్తుంది.
ఉమ దాన్ని ఆపుతూ...
నువ్వుండే ఇది ఏదో... ప్లాన్ వేసే ఉంటుంది.
అని నా వైపు ధైర్యంగా చూస్తూ పోదాం పదే అని చెప్పింది.
నేను ప్రిన్సిపాల్ సరిత మేడం దగ్గరకు వెళ్ళి వాణిని చూపిస్తూ...
మేడం మా వాణి వాళ్ళ అక్కకు డెలివరీ అయ్యింది. కూతురు పుట్టింది.
తను మన టౌన్ లో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్ లోనే ఉంది.
ఇప్పుడు మాకు క్లాస్ లేదు వెళ్ళి చూసి వస్తాం తను మిమ్మల్ని అడగటానికి భయపడుతుంది అని నేను వాణిని చూపిస్తూ చెప్పిన.
సరిత మేడం వాణి ఇలా రామ్మా...
తను చెప్పింది నిజమేనా అని అడిగింది.
వాణి భయపడుతూ... అవును మేడం అని చెప్పింది.
సరే దానికెందుకు భయం
వెళ్ళండి అని పర్మిషన్ ఇచ్చింది.
అది భయం పోయి...నవ్వుతూ వస్తూ ఉమా...నా వల్లనే మేడం పర్మిషన్ ఇచ్చింది అది తెగ సంబరపడి పోతూ చెప్పింది వాణి.
ఏంటే కీర్తి మేడంతో...
ఏం చెప్పావే నువు గ్రేటే బాబు అంటూ
మా కీర్తి పాప తోపు
దమ్ముంటే ఆపు
అని నవ్వుతూ... మీమ్స్ డైలాగ్స్ స్లొగన్స్ యిస్తుంది.
వాణి నా వైపు చూస్తూ...
అవును కీర్తి...!
ఏం చెప్పావే మేడం వెంటనే పర్మిషన్ ఇచ్చిందని అడిగింది.
ఏంటే నీకు తెలియదా...!
నీ మెంటల్ దాన అని ఉమ వాణి వైపు అదోలా చూస్తూ నన్ను అడిగింది.
నేను మేడంకు చెప్పిన కథ వాళ్ళకు చెప్పా ...
ఒసేయ్ రాక్షసి నాకు అక్కే లేదు కదే...!
దానికి ఎలా పాప పుట్టింది నేను చూడడానికి పోతున్న అని అడ్డంగా ఇరికించావ్ కదే మెంటల్ అంటుంది వాణి.
ఉమ మాత్రం నవ్వు ఆపుకోలేక....పడి పడి నవ్వుతూ...వాణి మీ అక్క కూతురుకీ ఏం పేరు పెడదామే అని ఆటపట్టిస్తుంది.
ఒసేయ్ మీరు నిజంగా నన్ను బాగా ఆడుకుంటున్నారే...
మీ సంగతి టైం వచ్చినప్పుడు చూస్తానే అంటూ సర్లే కాని నవ్వింది చాలు టికెట్ల తీసుకోడానికి డబ్బులు నేనైతే ఇవ్వను మీరే పెట్టాలి ఖర్చంతా అని అది తప్పించుకుంది.
సర్లే...నీ అక్కకి కూతురు పుట్టింది కదా పార్టీ ఇవ్వు... టికెట్ కు అవసరం లేదు అని ఉమ మళ్ళీ తనతో ఆడుకుంటుంది.
అలా వాణిని ఆటపట్టిస్తూ ...
మేం ముగ్గురం సినిమా హాల్ లోకి వెళ్ళాక ఫుల్ జోష్ మీద ఉంది ఫస్ట్ డే కదా మూవీ రిలీజ్ ఆ మాత్రం ఉంటుందిలే... అనుకున్నాం
సినిమా...స్టార్ కాకముందే
పెద్ద హీరో అని కొంతమంది కాలేజీ స్టూడెంట్స్ హీరో పోస్టర్ పెట్టి దండేసి కొబ్బరి కొట్టి అది జనంలోకి విసేరాశాడు
ఓ మాస్క్ పెట్టుకున్న స్టూడెంట్.
అది క్యాచ్ పట్టాలని ఇంకా ఉత్సాహంగా చూస్తున్నారు.
ఆ కొబ్బరి ముక్క(చిప్ప) నా దగ్గరకు వచ్చి కొంచెం తగిలినట్లుగా అనిపించి నా ఒళ్ళో పడింది.
ఏహ్... నువు లక్కీనే...
ఇంత మందిలో నీకే దొరికింది అని ఉమ,వాణి ఇద్దరు కలిసి కీర్తి...లక్కీ అని అరవబోతుంటే...
అపండే మీరు మీ గోల
ఏంటో....మీ తలతిక్క సంతోషం అని నేను ఆ కొబ్బరి ముక్కను మళ్ళీ ఆ మాస్క్ పెట్టుకున్న కుర్రాడి వైపు విసిరేశా అది వెళ్లి వాడి పక్కన ఉన్న అబ్బాయికి తగిలింది.
ఆ అబ్బాయి
ఎవడ్రా...వాడు నాకేసి కావాలని కొట్టాడు...
నీ అయ్య అని కోపంతో అరిచాడు.
దానికి సమాధానంగా
సారి భయ్యా...కావాలని వేయలేదు.
మా ముఖేష్ గాడు అనుకోకుండా విసిరేశాడు...మన హీరో అంటే వాడికి పిచ్చి ఇష్టం భయ్య ప్రతి సినిమాకి వస్తాడు అంటూ అరిచాడు.
ఓహ్....అలా అయితే మీ ఫ్రెండ్ ను ఇక్కడికి పంపించు బ్రో అని ఆ మాస్క్ తో ఉన్నోడు అరుస్తుంటే...
రేయ్ ఆ ముఖేష్ నీ ఫ్రెండ్ రా అయ్యా నా ఫ్రెండ్ కాదు ఓ ఐదు నిమిషాలు ఆగు వాడే వస్తాడు అనే సరికి అందరూ నవ్వారు.
అంత మందిలో వాడికి దీటైన సమాధానం ఇస్తుంది ఎవరో ఎవరికి తెలియట్లేదు. కానీ హాల్ అంతా సినిమాకి ముందే నవ్వులు పూయిస్తున్నాడు.
నేను కూడా ఎవరా సమాధానం ఇచ్చేది అని ఆత్రంగా వెతుకుతున్న కానీ కనిపించటం లేదు...
సినిమాలో ముఖేష్ యాడ్ నుంచి మొదలుకొంటె
హీరో డైలాగ్స్ వరకు అన్నింటికి కౌంటర్ ఇచ్చే లెవెల్ లో థియేటర్ అంతా పగలబడి నవ్వేలా చేస్తున్నాడు...
థియేటర్ లో అందరూ వాడు చేసే జోక్స్ కోసం ఎదురు చూస్తున్నారేమో అనేంతలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో యమ నవ్వులు పూయిస్తున్నాడు.
అందులో ఒకడు కలుగజేసుకుని
ఏం తమ్ముడూ... నువు స్టాండప్ కమెడియన్ కదా బాగా నవ్విస్తున్నావ్ లే అని అన్నాడు...
స్టాండ్ అప్పు లేదు స్టాండ్ డౌను లేదు
క్లాస్ ఎగ్గొట్టి మరి సినిమా చూస్తున్నాం భయ్యా...
ఆ మాత్రం రచ్చ చేయకపోతే ఎలా చెప్పు అనే సరికి మళ్ళీ థియేటర్ లో గొళ్ళున నవ్వులు వినిపించాయి.
వాణి,ఉమా మాత్రం వాడు చేసే జోక్స్ కోసం సినిమా చూస్తూ వాడిలాగానే పంచ్ డైలాగులు వేద్దాం అని చూస్తున్నారు కానీ వాళ్ళ వల్ల కావట్లేదు.
సినిమాలో ఐటమ్ సాంగ్ వస్తుంటే...
ఆడియెన్స్ లోంచి
ఓ బక్క పల్చని కుర్రాడు తన షర్ట్ విప్పుతూ... డొక్కలు కనిపించేలా ఎండిపోయిన ఫ్యాక్స్ (సిక్స్ ప్యాక్ కూడా కాదు 🤩 ) ఎగురు కుంటూ స్క్రీన్ దగ్గరకు వెళ్ళి డాన్స్ చేస్తుంటే...
అందరిలో అప్పుడు ఉత్సాహం మొదలైంది .
ఒరేయ్ బక్కోడా ఏంట్రా నీ అల్లరి అని ఎవడో ఒకడు అరుస్తున్నాడు కానీ అది ఎవడికి వినపడటం లేదు నాకు దగ్గరగా ఉండు కాబట్టి మాకు వినిపిస్తోంది.
వీడేనే ఆ కమెడియన్ అని వాణి ఉమా గట్టిగా అరుస్తూ...
ఏయ్.... ఎంజాయ్ చేయ్ వోయ్ అని అరుస్తున్నారు.
నేను వాళ్ళతో సరిగ్గా ఎంజాయ్ చేయలేక
ఆ బక్కోడిని చూస్తూ...ఆహా... లైఫ్ అంటే నీదిరా...
ఏం ఎంజాయ్ చేస్తున్నావ్ నువు కదరా అసలైన కుర్రాడివి
అని మనసులో అనుకుంటూ... సాంగ్ అయిపోయాక
అందరూ సైలెంట్ అయ్యాక
రేయ్ బక్కోడా...లవ్ యూ రా అని గట్టిగా అనేశా...
వాణి ఉమా నా వైపు చూస్తూ... ఒసేయ్ మెంటల్ ఏంటే నువు నీ అల్లరి సైలెంట్ గా ఉండే అని నా నోరు మూసేశారు.
థ్యాంక్యూ డార్లింగ్...
నీ ధైర్యానికి నేను ఫిదా అని వాడు గట్టిగా అరిచి మళ్ళీ వచ్చే శుక్రవారం ఇదే హల్ లో కొత్త సినిమా వచ్చినప్పుడు ఇదే మాట చెప్పు
అప్పుడు సీరియస్ గా నీపై ఇంట్రెస్ట్ పెట్టాలా వద్దా అని డిసైడ్ అయితా అని అనేశాడు.
ఆడియెన్స్ లోంచి ఒరే బక్కోడా
ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కన్నా
నువ్వే హైలెట్ అయ్యావు
నీ insta ఐడి చెప్పురా అలాగే నీకు ఫాలోవర్స్ పెరుగుతారు అని నవ్వాడు.
థ్యాంక్యూ భయ్యా...
ఇప్పుడే రేయ్ బక్కోడా అనేది టెంపరరీ ఐడి క్రియేట్ చేస్త ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో చేయండి అని చెప్పాడు .
వాడు మాట్లాడే ప్రతి మాటకి ఎంత సీరియస్ పర్సన్ అయినా హాయిగా నవ్వుకుంటున్నారు.
నాకెందుకో...బక్కోడి పై ఇంట్రెస్ట్ కలుగుతుంది.
సినిమా అయ్యాక... Instagram lo లో రేయ్ బక్కోడా అని సెర్చ్ చేశా
ఒక ఐడి కనిపించింది.
రిక్వెస్ట్ పెట్టి చాట్ మొదలు పెట్టిన కానీ
ఎలా తనతో పరిచయం పెంచుకోవాలో తెలియక నెంబర్ అడిగా వాడు డౌట్ తో...ఇస్తూనే...
ఓన్లీ వాట్సాప్ మాత్రమే కాల్స్ మాత్రం వద్దు అని చెప్పాడు.
సరే అని నెంబర్ తీసుకుని వాట్సాప్ చేస్తూ కాలేజీ డిటెయిల్స్ తన పర్సనల్ నేను అడగలేదు వాడు చెప్పలేదు.
ఓ రోజు నా బర్త్ డే అని చెప్పగానే వాట్సాప్ కాల్ చేసి హ్యాపీ బర్త్ అని విషెస్ చేసాడు.
థ్యాంక్స్ బక్కోడా...అని నేను అనే సరికి
ఓయ్ థియేటర్ ప్రపోజల్ నువ్వేనా
ఇన్ని రోజుల నుంచి చాట్ చేసేది
మరి చెప్పలేదు.
నువ్వే కదరా బక్కోడా...
నీ డిటెయిల్స్ ఏం వద్దు
నా డిటెయిల్స్ అడగొద్దు అని కండీషన్ పెట్టి నెంబర్ ఇచ్చావ్ ఇప్పుడు ఏంటి ఇలా అని నేను అడిగా
అంతేలే కొత్తలో ఎన్నెన్నో...అంటాం మీ ఆడవాళ్ళకు మాత్రమే కాదు మా మగాళ్ళకు ఆన్లైన్ పరిచయాలు అంటే భయం తెలుసా అని అన్నాడు.
రేయ్ బక్కోడా నీకు భయం ఏంట్రా...
థియేటర్ లో షర్ట్ విప్పుకుని డాన్స్ చేస్తవ్ థియేటర్ లో ఉన్న సైలెన్స్ అంతా నవ్వులతో బద్ధలు కొడతవ్
నువు కూడా అలా భయపడతావా అని ఇక రోజూ గంటలకు గంటలు మాటలతో సరిపోయేది.
ఉమా... వాణి....ఆ బక్కోడు ఎలా వుంటాడో కానీ
దీన్ని బానే పట్టాడే...!
ఎప్పుడైనా కలిశావానే అని నన్ను అడిగారు.
ఇప్పటిదాక ఆ ఆలోచన రాలేదే
కానీ వాడు టైం టు టైం చదువుతో పాటు పని చేస్తూ ఎంజాయ్ గా లైఫ్ లీడ్ చేస్తున్నాడు అనిపిస్తుంది.
ఎలాగైనా వాడిని కలవాలి అని
బక్కోడికి మెసేజ్ చేశా...
రేయ్ నిను చూడాలని వుంది అని
అయితే...
జనవరి 2 నా బర్త్ డే ఆ రోజు కూడా శుక్రవారం కొత్త సినిమా రిలీజ్ అయితుంది థియేటర్ లో కలుద్దాం అని అన్నాడు.
రేయ్ ఎప్పుడు ఆ థియేటర్ లో నేనా
నీ బర్త్ డే అన్నావ్ ఏదైనా టెంపుల్ కి రా అక్కడ కలుద్దాం అని చెప్పిన
నీ కోసం ఇప్పుడు నాలో లేని భక్తిని ఎలా క్రియేట్ చేసుకోవాలబ్బా...అని అన్నాడు.
ఆ రోజు నువ్వు వస్తే నీకో... విషయం చెప్తా నువు రా అని నేను అడిగా.
అమ్మో...
నన్ను అంత పిచ్చొన్ని చేయకే
నా బర్త్ డే రోజు నువ్వెంటీ ఎవరైనా సరే
నాకు ఒకటి చెప్తారు హ్యాపీ బర్త్ డే అని నవ్వాడు.
రేయ్ బక్కోడా...
నిజంగానే నువ్వు మొద్దువురా...
సరే Jan 2 కలుస్తున్నాం అంతే ఇంకేం చెప్పకు అని చెప్పేశా....
ఒసేయ్ Jan 2 ఎల్లుండే కదా నిను కలవాలని నాకు ఉంది కానీ అని ఏదో చెప్పబోయాడు .
ఏం లేదు ఎల్లుండి మనం కలుస్తున్నాం అంతే...అని ఫోన్ కట్ చేశా.
Jan 2 వచ్చింది నేను ఎప్పుడెప్పుడు గుడికి వెళ్దామా అని ఈ కథ మొదట్లో రాసుకున్న కవితను చదువుతూ...నాలో నేనే మురిసిపోతుంటే...
నా పక్కనే ఒక బైక్ వచ్చి ఆగింది.
ఏంటో...శృతి ఇవాల ఇంత అందంగా రెడీ అయ్యింది.
కొంపతీసి పెళ్లి చూపులా...అని మా ఇంటి పక్కనే ఉన్న నా స్కూల్ మేట్ అడిగాడు.
అవును రా ఇవాళ నా పెళ్లి చూపులు కాదు ప్రేమ చూపులు అని చెప్తుంటే...
అబ్బో...ఇలా రోజూ రెడీ అయితే నేనే ఎప్పుడో లవ్ చేసేవాణ్ణి ఇప్పుడు ఇంకొకడిని పడేశావ్ నువు గ్రేటే...అని అన్నాడు.
ఎహే ముందు నువు గుడి దగ్గర డ్రాప్ చేయరా
అర్జెంటుగా అని బ్రతిమాలితే...సరే లే నాకు టెంపుల్ దగ్గర చిన్న పని ఉంది పదా అని బైక్ పై రైడ్ చేస్తున్నాడు...హరి గాడు.
రేయ్ నీకు ఇంత భక్తి ఎప్పట్నుంచి బాబు
కొంపతీసి లైన్ వేయడానికి వెళ్తున్నావా ఏంటి.
ఎప్పుడు చూసినా...!
ఇంట్లో పుస్తకాలతో...లేకపోతే బయట ఏదో పని ఉంది అని వెళతావ్ అసలు ఎంజాయ్ అంటేనే తెలియదు రా నీకు అని నేను అన్నాను.
అంతే మేడం
ఏం చేస్తాం మా మధ్య తరగతి కష్టాలు అని ఏదో... భారీ డైలాగ్ చెప్పబోయాడు.
రేయ్ నీ డైలాగ్ తో పాటు బైక్ కూడా ఆపేయ్
నేను వెళ్లి దేవుడి దర్శనం చేసుకుని వస్తా అని చెప్పి గుడిలో ప్రదక్షిణలు చేసి పూజ అయ్యాక బక్కోడికి ఫోన్ చేశా...
అతను మాట్లాడుతూ...బయట నా కోసం వెయిట్ చేస్తున్న అని బైక్ నెంబర్ చెప్తూ....ఉండగా
నేను వెనక నుంచి వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం అని రేయ్ బక్కోడా అని వెనుక నుంచి హగ్ చేసుకుందాం అనుకున్నా...
అంతలోనే వాడు నా వైపు తిరిగాడు
ఒక్కసారిగా షాక్ అయిన
రేయ్ బక్కోడా అని పిలుస్తూ...ఉండగా
శృతి లవ్ యూ...బేబీ అంటూనే బక్కోడు షాక్ అయ్యాడు.
కాసేపు అలా చూసుకుంటూనే
ఓయ్ శృతి అని బక్కోడు.
రేయ్ హరి అని నేను
అలా ఒక్కసారి మా పరిచయంలో ఒకరి గురించి ఒకరికి తెలియకుండా కేవలం మనసులు మాట్లాడుకోవటం ఇదంతా తలుచుకుంటుంటే.
ఇంటి పక్కనే ఉన్నోడిని insta లో పరిచయం చేసుకుని ప్యార్ చేసిన నేను
ఇంట్లోనే ఉంటూ పనితో పాటు చదువుకుంటూ ఎంజాయ్ చేసే టైం వచ్చినప్పుడు ఫుల్ గా ఖుషీ అయ్యే హరిగాడు
ఇదంతా ఓ కలలా ఓ సినిమాలా ఉంది అని ఇద్దరం అనుకుంటూ ఎలా ఇంకా కనెక్ట్ కావాలో తెలియక తడబడుతుంటే...
ఉమా...వాణి
నాకు తెలియకుండానే మేం నేరుగా కలిసిన సన్నివేశాన్ని వీడియో తీసి
మాకు చూపిస్తుంటే అదేదో షార్ట్ ఫిల్మ్ చూసిన అనుభూతి కలుగుతుంది.
హరిగాడు తన కోసం నేను రాసుకున్న కవితని నాతో మళ్ళీ మళ్ళీ చదివించి
విని ఖుషి అయాపోతూ కళ్ళలోకి చూస్తూ.... ఇన్నాళ్లు పక్కనే ఉన్న కనిపించని నా మనసు కవయిత్రి ఇప్పుడు ఇంత అందంగా కనిపిస్తుంది.
అని లవ్ యూ శృతి అని ప్రేమతో మరో లోకాన్ని చూపిస్తున్నాడు.
ఇంకా ఉంది (అసలు కథ ఇప్పుడే మొదలైంది)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి