ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు
దోస్త్
తీపి,పులుపు,వగరు కారం,చేదు,ఉప్పు అనే షడ్రుచుల సమ్మేళనంలా జిందగీలో ఎదురయ్యే అనుభవాలు సుఖం దుఃఖం, కష్టం నష్టం, బాధ సంతోషం మనసులో కలిగే ఉద్వేగాలు స్నేహం మోహం వ్యామోహం ప్రేమ ఆప్యాయత అనురాగం విరక్తి వైరాగ్యం లాంటి వాటి వల్ల ఆందోళననో, ఆనందమో... ఏదైనా సరే స్వీకరిస్తూ...జీవనయానం సాగిపోవాలని తెలిపే...అర్థవంతమైన తత్వమే... ఉగాది పచ్చడి విశిష్టత అలాంటి మనస్తత్వం కలిగిన మా మనసుల సమ్మేళనంలో మర్చిపోలేని...అనుభవాలు గుర్తుండిపోయే...క్షణాలు సంతోషపడిన...సమయాలు ఎప్పటికప్పుడు నూతనంగా రూపుదిద్దుకునే మా జిందగీ ఎవరికి అర్థం కాని పరిచయం వేరే ఎవరితోను పోలిక లేని స్నేహం అహం అణువంతయిన కానరాని దోస్తాన్ వేర్వేరు లక్ష్యాలున్న... ఉమ్మడి ప్రణాళికల కలిగిన అభ్యర్థులం ఉద్యోగార్థులం ఒక్కొక్కరు... ఒక్కో తీరుగా సంతోషం సొంతమైన వాళ్ళం ఫిల్టర్ లేని మాటలతో... ఫిలాసఫీకల్ గా మాట్లాడుకునే మనుషులం జాతి రత్నాలం😜 ఉగాది పచ్చడిలో రుచిలా... అందరం కలిసి ఎంజాయ్ చేస్తున్న సోపతులం హ్యాపీ ఉగాది 😋🥳
ఎప్పుడు చూశానో
నన్ను నేను ఎక్కడని వెతకాలి ఏ కన్నె మనసు నన్ను తనలో దాచుకుందో నాలో మాత్రం నేను లేనని స్పష్టంగా తెలుస్తుంది అప్పుడు తనకై ఆలోచిస్తుంటే అదే నన్ను నేను వెతికే వేళ తెలిసింది ఎప్పుడు చూశానో తెలియదు కానీ ఎప్పుడూ చూస్తున్నట్టే ఉంది కళ్ళలో నిక్షిప్తం చేసుకున్నానో మనసులో దాచుకున్నానో తెలియదు కానీ ఆకాశ తారల తీరుగా కనిపిస్తూ కనువిందులు కల్గించేలా...ఉంది రూపం రాత్రంతా నాతో ఉన్నా కానీ పొద్దున లేవగానే తననే చూడాలి అనిపిస్తుంది అందుకే కనుల తెరలపై ఉన్న తనని మనసు పొరలలో పదిలం చేసుకున్న నా తోడుగా తను లేదని తెలిసి నా నీడలోనే చూస్తూ ఊహల్లో తనతో విహరిస్తున్న మనసుకు అనిపిస్తూనే... ఉంది చరవాణి తెరపై ఉన్న తనని నా ఎద పూల పాన్పుపై సేదతీరేలా నా కలలన్ని నిజమమ్యేలా నన్ను నేను మరో మనసులో...కనుగొంటానని
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి