బర్త్ డే శుభాకాంక్షలు 🥳
పుట్టే బిడ్డ కోసం
పురిటి నొప్పుల బాధను అనుభవిస్తూ
చావు అంచుల వరకు వెళ్లి
భయాన్నే భయపెట్టి విజవంతంగా
మనల్ని లోకానికి పరిచయం చేస్తుంది అమ్మ
ఒళ్ళంతా పచ్చి ముద్దైనా
ఒడిలోని పసిపాపను ముద్దాడుతూ
భరించలేని ఆవేదనని
ఆనందం అనుభవిస్తుంది అమ్మ
మన జీవితంలో ప్రతి క్షణం
అమ్మ తొమ్మిది నెలలు కన్న కలలకు తార్కాణం
మనం అణువులా మారి
గర్భాలయంలో ఉండగానే
మన అందాన్ని కూడా చూడకుండానే
ప్రేమించడం మొదలు పెట్టే
ఒకే ఒక్క వ్యక్తి అమ్మ
మన పుట్టిన రోజును
ఎంత ఎంజాయ్ చేస్తామో
అంతే సంతోషంగా
మనం పుట్టిన క్షణాల్ని
అమ్మ పురిటి గడియల్ని
మనల్ని మోసిన నవ మాసాల రోజుల్ని
అన్నింటిని తలుచుకుంటు
నిండు మనసారా దీవించే అమ్మ ప్రేమ
సృష్టిలోనే ఓ అద్భుతం
అంతకు మించిన నిస్వార్థ త్యాగం మరేది లేదు
బర్త్ డే అంటే...
మనం మాత్రమే పుట్టిన రోజు కాదు
మనతో పాటు మరోసారి అమ్మకూడా పుట్టింది
అందుకే మన బర్త్ డే తో పాటు
అమ్మకి కూడా హృదయ పూర్వక శుభాకాంక్షలు చెప్పుకుందాం
ఈ జూలై 6
నాకు అత్యంత ఆత్మీయ బంధువు LaOneya
నా సాహితీ మిత్రురాలు
మై డియర్ దోస్త్ నాగసాయి అనూష బర్త్ డే సందర్భంగా
వాళ్ళతో పాటు ఆ అమ్మలకు కూడా
బర్త్ డే శుభాకాంక్షలు చెప్తూ
Once again Happy Birthday dears 🎂🍫🍫🍫🍫🍫🎈
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి