28 August Special 🥳🥰

మై డియర్ మా ❣️

ఊహాత్మక ప్రపంచంలో మొట్టమొదటగా స్వప్నంలా పరిచయం అయ్యి నిజమైపోయిన బుజ్జమ్మ నీకు 4వ బర్త్ డే శుభాకాంక్షలు మా💐🌹🍫.

4 వ బర్త్ డే ఏంటి అనుకుంటున్నవా 🤔😁 ఆగు...ఆగు అక్కడికే వస్తున్న నాకు పరిచయం అయ్యాకా నాకు అమ్మగా మళ్ళీ పుట్టి ఇప్పటికి 4 వ వత్సరం అవుతుంది బుజ్జి అందుకే నానిగా నవ్వుతూ...నాలుగవ బర్త్ డే శుభాకాంక్షలు మా🍫🍫🍫🍫🍫.

మనల్ని కలిపిన వేదిక ఏదైనా కావచ్చు మన అభిరుచులతో ఓ బంధంగా మారిపోయి మనోహరమైన అనుబంధంగా నిలిచిపోయేలా చేసిన సాహిత్యానికి సంతోషంతో థ్యాంక్స్ చెబుతూ...మై డియర్ బుజ్జమ్మ నీకు అందమైన పుట్టిన రోజు శుభాకాంక్షలు 🌹🌹🌹🌹.


ఆన్ లైన్ సమీక్షల నుంచి ఆఫ్ లైన్ లో మంచి చెడుల జాగ్రత్తలు చెప్పేంత వరకు అభివృద్ధి చెందిన మన అనుబంధం ఇట్లనే ఉంటదని శ్వాసిస్తూ నాలుగవ సారి నాలుగవ బర్త్ డే శుభాకాంక్షలు మా 💐💐💐

మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు నాని... అంటూ పిలిచిన నీ వాత్సల్యపు మాధుర్యం గిప్పటికి నా ఫోటోగ్రాఫిక్ మొమోరిలో ముద్రించుకపోయింది.రెండవసారి కలిసినప్పుడు ప్రేమతో... ఏదైనా తినిపించాలి అనుకున్న నీ తపనకే నా కడుపు నిండిపోయింది. అప్పుడు మనం కొన్ని నిమిషాలే మాట్లాడుకున్నా అవన్నీ మళ్ళీ మనం కలిసేవరకూ నా మనసు మననం చేసుకుంటూ ఉంటుందేమో మన మధ్య ఉన్న అనుబంధం నాలుగేళ్లదో లేక అంతకు పూర్వమో కానీ ఇప్పుడే పరిచయం అయిన ఓ సరికొత్త ప్రేమలా మరియు ఎప్పట్నుంచో దీవించే వాత్సల్యం, అనురాగంలా అనిపిస్తుంది.

 ప్రేమానురాగాలు కురిపించే వ్యక్తుల మధ్య కలిసి ఉన్నప్పుడు కాలం మర్చిపోతాం అదే కాలాన్ని వారి జ్ఞాపకంగా గుర్తుంచుకుంటాం.అలా నేను కాలాన్ని మర్చిపోయినా అదే కాలాన్ని ఓ క్లిప్ గానో...రీల్ గానో మనోనేత్రంతో వీక్షించే అద్బుత పరిచయం నువ్వు మా.

కలిసింది రెండుసార్లే అయినా ఎప్పుడూ కలుస్తున్నట్లు అనిపించే మరపురాని ఆప్యాయత నీదే బుజ్జి అందుకే... నీకు విసుగు తెప్పించినా పర్లేదు నేను మళ్ళీ మళ్ళీ విషెస్ చెప్తూనే ఉంట 
హ్యాపీ బర్త్ డే....మై డియర్ మా 😁🥳🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫

Many more happy returns of the day maa 💐🍫😍🥰🥳
(ఎమోజితో నా పూర్తి ఎమోషన్ ను చెప్పలేను కానీ ఎమోజి లేకపోతే అస్సలు ఎమోషనే తెలియదని ఇలా ఎమోషన్ ని ఎమోజితో ఎక్స్ప్రెస్ చేస్తున్న)

పుట్టిన రోజు శుభాకాంక్షలు బుజ్జమ్మ 🥳🥳🥳🥳🥳🥳🥳🥳

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

August 12th

Happy B'day