పోస్ట్‌లు

28 August Special 🥳🥰

మై డియర్ మా ❣️ ఊహాత్మక ప్రపంచంలో మొట్టమొదటగా స్వప్నంలా పరిచయం అయ్యి నిజమైపోయిన బుజ్జమ్మ నీకు 4వ బర్త్ డే శుభాకాంక్షలు మా 💐🌹🍫. 4 వ బర్త్ డే ఏంటి అనుకుంటున్నవా 🤔😁 ఆగు...ఆగు అక్కడికే వస్తున్న నాకు పరిచయం అయ్యాకా నాకు అమ్మగా మళ్ళీ పుట్టి ఇప్పటికి 4 వ వత్సరం అవుతుంది బుజ్జి అందుకే నానిగా నవ్వుతూ... నాలుగవ బర్త్ డే శుభాకాంక్షలు మా🍫🍫🍫🍫🍫. మనల్ని కలిపిన వేదిక ఏదైనా కావచ్చు మన అభిరుచులతో ఓ బంధంగా మారిపోయి మనోహరమైన అనుబంధంగా నిలిచిపోయేలా చేసిన సాహిత్యానికి సంతోషంతో థ్యాంక్స్ చెబుతూ.. .మై డియర్ బుజ్జమ్మ నీకు అందమైన పుట్టిన రోజు శుభాకాంక్షలు 🌹🌹🌹🌹. ఆన్ లైన్ సమీక్షల నుంచి ఆఫ్ లైన్ లో మంచి చెడుల జాగ్రత్తలు చెప్పేంత వరకు అభివృద్ధి చెందిన మన అనుబంధం ఇట్లనే ఉంటదని శ్వాసిస్తూ నాలుగవ సారి నాలుగవ బర్త్ డే శుభాకాంక్షలు మా 💐💐💐 మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు నాని... అంటూ పిలిచిన నీ వాత్సల్యపు మాధుర్యం గిప్పటికి నా ఫోటోగ్రాఫిక్ మొమోరిలో ముద్రించుకపోయింది.రెండవసారి కలిసినప్పుడు ప్రేమతో... ఏదైనా తినిపించాలి అనుకున్న నీ తపనకే నా కడుపు నిండిపోయింది. అప్పుడు మనం కొన్ని నిమిషాలే మాట్లాడుకున్నా అవన్నీ మ...

August 12th

2022 ఏప్రిల్ 16 న మధ్యాహ్న సమయంలో మొదటిసారి ప్రత్యక్షంగా కలిసిన నాలాంటి మరొక మనీషి కార్తీక్ అన్న(నాలాంటి అంటే ఆహార్యంలో కాదు ఆలోచనా విధానంలో).ఏ ఎక్స్పెక్టెషన్ లేకుండా వెళ్ళిన నాకు అన్నని చూడగానే తాత్వికానందం కలిగింది. స్థిరనిశ్చలమై ఆలోచనలతో...వర్తమానంలో సమర్థవంతంగా జీవిస్తున్న సాధువు లెక్క కనిపించాడు. అన్నకు నాకు మధ్య జరిగిన సంభాషణలు అరకొరే అయినా కార్తీకన్నతో అనుబంధం చాలా ఏళ్ళ క్రితం మొదలైంది అని ఇప్పటికి అనిపిస్తుంది. కార్తీక్ అన్న ఆశయ నిర్మాణంలో జరగబోయే సహృదయ సమ్మేళనంలో నేను సైతం ఆనందాన్ని పొందాలని వెళ్ళిన నాకు అప్పటిదాక నేను జీవించిన జీవితం నుంచి ఊహాత్మక అభిరుచి ప్రపంచంలో అడుగుపెట్టినట్టు ఆ రెండున్నర రోజులు గడిపేసా. నిజానికి అన్న నుంచి నేను గ్రహించిన విషయాలన్నింటినీ నా దినచర్యలో పొందుపరచాలని, కవితాత్మకంగా రాయాలని,ఆ రెండున్నర రోజుల పాటు గడిపిన జీవితాన్ని ఓ అనుభవైక ఆనందంగా లిఖించాలని తపించిన నాకు నా నేస్తాలతో ఆ సంతోషాన్ని పంచుకొంటున్న, సత్సాంగత్యంతో మనలో కలిగే మార్పు ఎలా ఉంటుందో మా అన్న పరిచయం అలాగే అనిపించింది. మా అమ్మ వల్ల పరిచయం అయిన రైటర్ ను  sir అనో, గారు అని పిలుస్తూ అక్కడెక...

Happy B'day

పుట్టినప్పటి నుండి నా నేస్తమై నిలిచి  బాధ్యతానుబంధమై పోయింది పసి ప్రాయం నుంచి నాకు పోటిగా మారి ఇంట్లో నా ప్రథమ శత్రువుగా ఏర్పడింది చదువు నాతో చెప్పించుకుంటూ నాతోనే పోటీపడి వివేక వంతమైన విద్యార్థిగా ఎదిగింది అన్నా చెల్లెళ్ళ బంధం అంటే స్నేహానుబంధాల ఆత్మీయత అని  మరో ఇంటికెళుతూ... కన్నీటిని పరిచయం చేసింది తనలాంటి మరో రూపాన్ని  తన ప్రేమ అపురూపాన్ని అందించి  తనతో చిన్ననాటి జ్ఞాపకాలను నా ముందుంచింది ఎన్నో కొట్లాటలలో నన్ను ఓడేలా చేసింది ఎన్నో నవ్వులు కలిసి మురిసిపోయేలా చేసింది ఎంతో గారాబంతో అన్నను అయినా సరే చిన్న అంటూ నన్ను చిన్నవాడిలా మార్చేసింది కలిసి పెరిగిన రోజుల్లో అల్లరితో అలకలతో కోపాలతో ఎలా ఆనందంగా గడిచాయో తలుచుకుంటే అప్పుడేనా అనిపిస్తుంది. తోబుట్టువుల తోడుంటే ప్రతి క్షణం ఓ సంతోషం ఓ ఆనందం ప్రతి అల్లరి ఓ జ్ఞాపకం ప్రతి కోపం  ప్రేమ కోసమే అనిపిస్తుంది హ్యాపీ బర్త్ డే మై డియర్ సిస్టర్ 🎂🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫

ఎదురు చూస్తున్నా😍

చిత్రం
నిన్ను నేరుగా చూసి కళ్ళతో.‌..మాత్రమే కాదు  మాటలతో.‌..మనసుతో స్పృశించాలని కలల కౌగిలిలో నీతో...గడిపిన అపురూప క్షణాలు ఊహల్లో నీతో...విహరించిన  ఎన్నో ఆనంద సమయాలు నిజమయ్యేలా నిన్ను చేరాలని  నా మదికి సంధించిన  నీ చూపుల చిలిపి బాణాల వలపు తీపి బాధను నీ లోగిలికి ఎప్పుడు పరిచయం చేద్దామా అని నాలో వున్న నిన్ను నీకెలా పరిచయం చేయాలా అని మన తొలి ప్రణయ ప్రయాణం ఎప్పుడు మొదలెడదామా అని తనువు మనసు తపనతో... ఉత్సాహంతో ఎదురు చూస్తుంది బుజ్జి

పుడమి

ప్రకృతిలో భాగమై పరవశించే నేను సాగు పుడమిని చూస్తే పులకరించిపోయి  నా అస్థిత్వాన్ని తలచి నేను గర్విస్తున్న అనుక్షణం నేలమ్మను నమ్మి జీవిస్తున్న తీరైన రంగుల మేను కలిగిన పుడమిపై పచ్చని సిరిసంపదల కాంతి పూలు పూయిస్తూ పుడమి పుప్పొడి పరిమళాన్ని అనుక్షణం ఆస్వాదించే అదృష్టం నాది మన్నులో దాగిన అన్నం మెతుకులను మనసుతో వీక్షించే సునిశిత దృష్టి నాది తడి ఆరిన తన దేహంపై కాసింత వర్షం కురిస్తే నేలతల్లికి పురుడు పోసే వృత్తి నాది కాలానికో తీరుగా కనువిందు చేసేలా అందాల కమతాల్లో...పంటల్ని పండిస్తూ పగలు రాత్రుళ్లు తన చెంతనే ఉంటూ పుడమికై ఆనందపు స్వేదం చిందిస్తూ సేద్యం చేస్తున్న                                   -తాళ్ళశ్రీ

ఎవరివో... నువ్వు

కనులలో కనిపించే రూపానివో.. నిదురలో నిలిచిన కలవో..! పెదవులపై పలికే పలుకువో.. మౌనం వీడని మాటవో..! వెలుగులు పంచే వెన్నెలవో.. చీకటిని నింపే నిశిదివో..! విజయం చేకూర్చే తోడువో.. ఒంటరిని చేసే ఓటమివో..! ఎదలయను పెంచే సడివో.. మదిని మెలిపెట్టే జ్ఞాపకానివో..! జీవితంలో ఆరంభమైన ఆశవో.. బ్రతుకులో భారమైన బంధానివో..! సంతోషం పంచే స్నేహితుడివో.. కలతై మిగిలిపోయే కాలానివో..! ఏమో.. ఎవరివో నీవు..!                 - చిన్నూ✍️

ఉగాది యాదిలో

పొద్దున్నే తెల్లార్తుంటెనే అమ్మ నిద్ర లేప్తూ... రేయ్..లేవ్రా ఇయ్యాల పండ్గపూట అట్ల పండుకోకపోతే అట్లవొయ్ మాడాకాలు,మోదుగ ఆకులు,యాప పూత తీసుకుని రావచ్చు కదా అగో...బయట మీ దోస్త్ గాడు వచ్చి ఎదురు సూస్తుండు పో అని నిద్ర అంత కరాబ్ చేసింది. అమ్మ మనకు మాడి శెట్లు ఎక్కడివే... "పండ్గ పూట ఎవడితోనో మాటలు తినమంటవ్" నేను పోనుపో...అన్నగాన్కి శెప్పరాదు ఎప్పుడు నేనే పోవాల్నా. అరే చిన్నోడా... పెద్దోడు అప్పుడే...పండ్గ సమాన్ తేనికే చిట్టి రాసుకుని దుక్నం కాడికి పోయిండు. నువు షాప్ కాడికి పోరా అంటే సగం సగం సమాను తెస్తవ్ పోనీ చిట్టి రాసుకోని పోయి తెస్తవా అంటే అమ్మో..."మా ఇస్కూల్ ల ఇంకా అంత పెద్ద సదువు నేర్పలేదే అంటవ్". అందుకే నిన్ను పొలాల పోంటి పోయి ఆకులు తెమ్మనేది. అయినా రాతిరి నువ్వే శెప్పినవ్ కదరా అమ్మ "రేపు పండ్గకి మాడాకులు నేనే తెస్తనే నాయనను తేవొద్దను అని" ఇప్పుడు ఇట్ల అంటవ్ బాతకానోడా  నీ మాటలు పట్టుకోని "మీ నాయనకు తేవొద్దు అని శెప్పిన నేను దిమాక్ లేని దానిని"  "అమ్మా పోతున్ననే పండ్గపూట ఎందుకు తిడ్తవ్" నేను వచ్చే వరకైతే బచ్ఛాలు(భక్ష్యాలు) చేసిపెట్టు. బయట ...