పుడమి

ప్రకృతిలో భాగమై పరవశించే నేను
సాగు పుడమిని చూస్తే పులకరించిపోయి 
నా అస్థిత్వాన్ని తలచి నేను గర్విస్తున్న
అనుక్షణం నేలమ్మను నమ్మి జీవిస్తున్న

తీరైన రంగుల మేను కలిగిన పుడమిపై
పచ్చని సిరిసంపదల కాంతి పూలు పూయిస్తూ
పుడమి పుప్పొడి పరిమళాన్ని
అనుక్షణం ఆస్వాదించే అదృష్టం నాది

మన్నులో దాగిన అన్నం మెతుకులను
మనసుతో వీక్షించే సునిశిత దృష్టి నాది
తడి ఆరిన తన దేహంపై కాసింత వర్షం కురిస్తే
నేలతల్లికి పురుడు పోసే వృత్తి నాది

కాలానికో తీరుగా కనువిందు చేసేలా
అందాల కమతాల్లో...పంటల్ని పండిస్తూ
పగలు రాత్రుళ్లు తన చెంతనే ఉంటూ
పుడమికై ఆనందపు స్వేదం చిందిస్తూ సేద్యం చేస్తున్న
         

                        -తాళ్ళశ్రీ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

August 12th

28 August Special 🥳🥰

Happy B'day