August 12th

2022 ఏప్రిల్ 16 న మధ్యాహ్న సమయంలో మొదటిసారి ప్రత్యక్షంగా కలిసిన నాలాంటి మరొక మనీషి కార్తీక్ అన్న(నాలాంటి అంటే ఆహార్యంలో కాదు ఆలోచనా విధానంలో).ఏ ఎక్స్పెక్టెషన్ లేకుండా వెళ్ళిన నాకు అన్నని చూడగానే తాత్వికానందం కలిగింది.

స్థిరనిశ్చలమై ఆలోచనలతో...వర్తమానంలో సమర్థవంతంగా జీవిస్తున్న సాధువు లెక్క కనిపించాడు.

అన్నకు నాకు మధ్య జరిగిన సంభాషణలు అరకొరే అయినా కార్తీకన్నతో అనుబంధం చాలా ఏళ్ళ క్రితం మొదలైంది అని ఇప్పటికి అనిపిస్తుంది.

కార్తీక్ అన్న ఆశయ నిర్మాణంలో జరగబోయే సహృదయ సమ్మేళనంలో నేను సైతం ఆనందాన్ని పొందాలని వెళ్ళిన నాకు అప్పటిదాక నేను జీవించిన జీవితం నుంచి ఊహాత్మక అభిరుచి ప్రపంచంలో అడుగుపెట్టినట్టు ఆ రెండున్నర రోజులు గడిపేసా.

నిజానికి అన్న నుంచి నేను గ్రహించిన విషయాలన్నింటినీ నా దినచర్యలో పొందుపరచాలని, కవితాత్మకంగా రాయాలని,ఆ రెండున్నర రోజుల పాటు గడిపిన జీవితాన్ని ఓ అనుభవైక ఆనందంగా లిఖించాలని తపించిన నాకు నా నేస్తాలతో ఆ సంతోషాన్ని పంచుకొంటున్న, సత్సాంగత్యంతో మనలో కలిగే మార్పు ఎలా ఉంటుందో మా అన్న పరిచయం అలాగే అనిపించింది.

మా అమ్మ వల్ల పరిచయం అయిన రైటర్ ను  sir అనో, గారు అని పిలుస్తూ అక్కడెక్కడో దూరంగా ఉంచడం ఇష్టం లేక అన్న అని పిలుస్తూ గొప్ప వాళ్ళను బంధువులుగా మార్చుకునే నేను కార్తీకన్న అని పిలుస్తున్న .

కార్తీకన్న అందరికీ రైటర్ గా, తపస్వి లా కవన మన్మధుడిగా, కాంటెంపరరీ కాన్సెప్ట్ తో పొలిటికల్ పవర్ పంచ్ రాసే రైటర్ గా కనిపించవచ్చు కానీ నాకు మాత్రం అసలైన ఆధ్యాత్మికతతో జీవించే ఓ సాధువు, ప్రస్తుతాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తున్న మనీషి,

12 ఆగష్టు కార్తీకన్న బర్త్ డే సందర్భంగా రాసుకున్న కొన్ని మాటలు

బర్త్ డే శుభాకాంక్షలు అన్న 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

28 August Special 🥳🥰

Happy B'day