ఎదురు చూస్తున్నా😍

నిన్ను నేరుగా చూసి
కళ్ళతో.‌..మాత్రమే కాదు 
మాటలతో.‌..మనసుతో స్పృశించాలని
కలల కౌగిలిలో
నీతో...గడిపిన అపురూప క్షణాలు
ఊహల్లో నీతో...విహరించిన 
ఎన్నో ఆనంద సమయాలు
నిజమయ్యేలా నిన్ను చేరాలని 
నా మదికి సంధించిన 
నీ చూపుల చిలిపి బాణాల వలపు తీపి బాధను
నీ లోగిలికి ఎప్పుడు పరిచయం చేద్దామా అని
నాలో వున్న నిన్ను
నీకెలా పరిచయం చేయాలా అని
మన తొలి ప్రణయ ప్రయాణం
ఎప్పుడు మొదలెడదామా అని
తనువు మనసు తపనతో...
ఉత్సాహంతో ఎదురు చూస్తుంది బుజ్జి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దోస్త్

ఎప్పుడు చూశానో