పోస్ట్‌లు

ఎదురు చూస్తున్నా😍

చిత్రం
నిన్ను నేరుగా చూసి కళ్ళతో.‌..మాత్రమే కాదు  మాటలతో.‌..మనసుతో స్పృశించాలని కలల కౌగిలిలో నీతో...గడిపిన అపురూప క్షణాలు ఊహల్లో నీతో...విహరించిన  ఎన్నో ఆనంద సమయాలు నిజమయ్యేలా నిన్ను చేరాలని  నా మదికి సంధించిన  నీ చూపుల చిలిపి బాణాల వలపు తీపి బాధను నీ లోగిలికి ఎప్పుడు పరిచయం చేద్దామా అని నాలో వున్న నిన్ను నీకెలా పరిచయం చేయాలా అని మన తొలి ప్రణయ ప్రయాణం ఎప్పుడు మొదలెడదామా అని తనువు మనసు తపనతో... ఉత్సాహంతో ఎదురు చూస్తుంది బుజ్జి

పుడమి

ప్రకృతిలో భాగమై పరవశించే నేను సాగు పుడమిని చూస్తే పులకరించిపోయి  నా అస్థిత్వాన్ని తలచి నేను గర్విస్తున్న అనుక్షణం నేలమ్మను నమ్మి జీవిస్తున్న తీరైన రంగుల మేను కలిగిన పుడమిపై పచ్చని సిరిసంపదల కాంతి పూలు పూయిస్తూ పుడమి పుప్పొడి పరిమళాన్ని అనుక్షణం ఆస్వాదించే అదృష్టం నాది మన్నులో దాగిన అన్నం మెతుకులను మనసుతో వీక్షించే సునిశిత దృష్టి నాది తడి ఆరిన తన దేహంపై కాసింత వర్షం కురిస్తే నేలతల్లికి పురుడు పోసే వృత్తి నాది కాలానికో తీరుగా కనువిందు చేసేలా అందాల కమతాల్లో...పంటల్ని పండిస్తూ పగలు రాత్రుళ్లు తన చెంతనే ఉంటూ పుడమికై ఆనందపు స్వేదం చిందిస్తూ సేద్యం చేస్తున్న                                   -తాళ్ళశ్రీ

ఎవరివో... నువ్వు

కనులలో కనిపించే రూపానివో.. నిదురలో నిలిచిన కలవో..! పెదవులపై పలికే పలుకువో.. మౌనం వీడని మాటవో..! వెలుగులు పంచే వెన్నెలవో.. చీకటిని నింపే నిశిదివో..! విజయం చేకూర్చే తోడువో.. ఒంటరిని చేసే ఓటమివో..! ఎదలయను పెంచే సడివో.. మదిని మెలిపెట్టే జ్ఞాపకానివో..! జీవితంలో ఆరంభమైన ఆశవో.. బ్రతుకులో భారమైన బంధానివో..! సంతోషం పంచే స్నేహితుడివో.. కలతై మిగిలిపోయే కాలానివో..! ఏమో.. ఎవరివో నీవు..!                 - చిన్నూ✍️

ఉగాది యాదిలో

పొద్దున్నే తెల్లార్తుంటెనే అమ్మ నిద్ర లేప్తూ... రేయ్..లేవ్రా ఇయ్యాల పండ్గపూట అట్ల పండుకోకపోతే అట్లవొయ్ మాడాకాలు,మోదుగ ఆకులు,యాప పూత తీసుకుని రావచ్చు కదా అగో...బయట మీ దోస్త్ గాడు వచ్చి ఎదురు సూస్తుండు పో అని నిద్ర అంత కరాబ్ చేసింది. అమ్మ మనకు మాడి శెట్లు ఎక్కడివే... "పండ్గ పూట ఎవడితోనో మాటలు తినమంటవ్" నేను పోనుపో...అన్నగాన్కి శెప్పరాదు ఎప్పుడు నేనే పోవాల్నా. అరే చిన్నోడా... పెద్దోడు అప్పుడే...పండ్గ సమాన్ తేనికే చిట్టి రాసుకుని దుక్నం కాడికి పోయిండు. నువు షాప్ కాడికి పోరా అంటే సగం సగం సమాను తెస్తవ్ పోనీ చిట్టి రాసుకోని పోయి తెస్తవా అంటే అమ్మో..."మా ఇస్కూల్ ల ఇంకా అంత పెద్ద సదువు నేర్పలేదే అంటవ్". అందుకే నిన్ను పొలాల పోంటి పోయి ఆకులు తెమ్మనేది. అయినా రాతిరి నువ్వే శెప్పినవ్ కదరా అమ్మ "రేపు పండ్గకి మాడాకులు నేనే తెస్తనే నాయనను తేవొద్దను అని" ఇప్పుడు ఇట్ల అంటవ్ బాతకానోడా  నీ మాటలు పట్టుకోని "మీ నాయనకు తేవొద్దు అని శెప్పిన నేను దిమాక్ లేని దానిని"  "అమ్మా పోతున్ననే పండ్గపూట ఎందుకు తిడ్తవ్" నేను వచ్చే వరకైతే బచ్ఛాలు(భక్ష్యాలు) చేసిపెట్టు. బయట ...

అందమైన జ్ఞాపకం

విప్పారిన నా కళ్ళు ఏదో వింతను చూడబోతున్నాయి నా చుట్టూరా పరిసరాలను  ఆక్షేపణ లేకుండా వీక్షిస్తుంటే మనసు మాత్రం  గత జ్ఞాపకాల గురుతుల వెంట కవాతు చేస్తుంది తనతో...పుష్కర కాలపు పరిచయం కాదు కాదు నా ఎదలో నిండిన ప్రణయం నాతో నేను నాలో నేను మనసులో మాట్లాడుకునే వయసులో అనుకుంటా తొలిసారి విన్నాను ఓ అందమైన చరితార్థమైన పేరు ఆ పేరు విన్న వెంటనే...నాలో ముద్రించుకున్నది ఓ రూపం ఆ రూపాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా...! అనే ఉత్సాహం నాలో... మొదలైంది చూసి చూడగానే అనుకున్నా... నాతో...నేను సంఘర్షణ పడేలా చేసే ఈ అందాల రాక్షసి  నా ప్రణయ కావ్యాల్లో‌...కీర్తించబడే దేవత అని అప్పట్నుంచి తన నిదర్శన భాగ్యంతో... ఎప్పటికప్పుడు సరికొత్త ఉత్సాహం కలిగించేది ఇద్దరి వయసులు పెరిగే కొద్దీ మనసులు మరింత దగ్గరయ్యాయి తను చూపులతో...నా మది స్పృశిస్తుంటే నేను మాత్రం ఆ కన్నుల కదలికలో... నాపై దాచుకున్న కడలి అంత ప్రేమను ఆస్వాదించా మా మధ్య మాములు మాటలు తడబడుతుంటే మాలోపలి...భావాలు కవిత్వ రూపాన్ని పొందాయి తను దూరమై పోతుంది అనుకునే ప్రతి సారి మరింత దగ్గరయ్యేది...నా మది ఇంకా మురిసిపోయేలా నా అభిరుచులు తన యిష్టంగా మార్చుకుంది ఇద్దరం త...

ఎప్పుడు చూశానో

నన్ను నేను ఎక్కడని వెతకాలి ఏ కన్నె మనసు నన్ను తనలో దాచుకుందో  నాలో మాత్రం నేను లేనని స్పష్టంగా తెలుస్తుంది అప్పుడు తనకై ఆలోచిస్తుంటే అదే నన్ను నేను వెతికే వేళ తెలిసింది ఎప్పుడు చూశానో తెలియదు కానీ ఎప్పుడూ చూస్తున్నట్టే ఉంది కళ్ళలో నిక్షిప్తం చేసుకున్నానో మనసులో దాచుకున్నానో తెలియదు కానీ ఆకాశ తారల తీరుగా కనిపిస్తూ కనువిందులు కల్గించేలా...ఉంది రూపం రాత్రంతా నాతో ఉన్నా కానీ పొద్దున లేవగానే తననే చూడాలి అనిపిస్తుంది అందుకే కనుల తెరలపై ఉన్న తనని మనసు పొరలలో పదిలం చేసుకున్న నా తోడుగా తను లేదని తెలిసి నా నీడలోనే చూస్తూ ఊహల్లో తనతో విహరిస్తున్న మనసుకు అనిపిస్తూనే... ఉంది చరవాణి తెరపై ఉన్న తనని నా ఎద పూల పాన్పుపై సేదతీరేలా  నా కలలన్ని నిజమమ్యేలా నన్ను నేను మరో మనసులో...కనుగొంటానని

ఫోటో పై కవిత

చిత్రం
  ద్వీపాంతరంలో నల్లని కురులతో విరుల తోరణం మధ్యలో సేదతీరుతుంటే అందాల సంభ్రమాశ్చర్యాల స్వర్గపుటంచుల్లో ఉన్నట్టుంది కదలాడే...స్పష్టమైన ప్రతిబింబాల మధ్యన నేనో...ప్రతిమనై నిలిచిపోయానేమో నీరంతా...నీలాకాశంతో కలిసినట్టు అగుపించే... అద్భుత సమయనా ఏకాంత వేళ తారా కాంతలతో... సంగమించే చంద్రుని వంక వీక్షిస్తూ... ఊహా లోకాన విహరిస్తున్నానేమో నన్నే నే మరచిపోయి... అందాల్లో కలిసిపోయిన అంగనలా అభిసారికనై ఎదురు చూస్తున్నాను