పోస్ట్‌లు

హ్యాపీ బర్త్ మా

 అమ్మా... నీకు ఏడాదికి మూడు పుట్టినరోజులు పుట్టిన రోజు తెలియకపోయినా  ఆధార్ లో ఉన్న పుట్టిన రోజుతో కలిపి నాలుగు సార్లు నీ బర్త్ డే వస్తుంది ❣️ అందులో నాది ఒకటి  నీకు చదువు రాకపోయినా... మా బర్త్ డే లు భలే గుర్తుంచుకున్నావ్ చూడు అమ్మలంటే ఆషామాషీ కాదు అద్భుతం అంతే మా❣️ అన్నయ పుట్టిన రోజును అట్టముక్కపై రాయించి  దాన్ని జాగ్రత్తగా ఇప్పటికీ దాచి ఉంచి మేం ఎదుగుతూ చదువుకునే వయసులో చూపించినవ్  అప్పటి నుంచి క్రమం తప్పకుండా అన్న బర్త్ డే ను ఎంజాయ్ చేస్తూ...ఉన్నం ఇక నా పుట్టిన రోజు కథైతే... చాలా గమ్మత్తుగా చెప్తవ్ చూడు అది వింటుంటే మస్త్ ఖుషీ అయితదే కొత్త సంవత్సరం ముగ్గులేసిన తెల్లారే సంక్రాంతికి ఇంకా పది దినాలుండగా నువు పుట్టినవ్ అంటే... గప్పుడు తెలిసింది... అంటే మనం కొత్తేడాది రెండో తారీఖున భూమ్మీదకు వచ్చినం అని ఇగ అప్పటి నుంచి... నేను అవతరించిన దినం కొంత కొత్తగా అనిపిస్తది ఇగ ఇయ్యాల... పొద్దున అన్న విష్ చేయడం చెల్లి వీడియో కాల్ లో HBD చెప్పడం జరిగింది అమ్మా...నువు మాత్రం హ్యాపీ బర్త్ నాయిన అని ఫోన్ లో చెప్తుంటే కొంచెం ఎమోషన్ తో ఖుషీ అయిననే ఎంత ప్రేమతో చెప్పినవో కానీ నిజంగా...

మనసైనోడు

నిత్యం నన్ను చూస్తే... తనలో తాను తపించి తరించిపోయే  నవ యవ్వన మనస్కుడు నాకై...తనతో తాను సంఘర్షణ పడుతూ నిరంతరం తన అంతరంగాన నన్నే అన్వేషిస్తున్న చెలికాడు నన్నో...దేవతలా తలిచి  తన హృదయంలో కొలిచి నా అపూరూప దర్శనానికై ప్రతి క్షణం ఎదురుచూసే సఖుడు నా కోసం తనని తాను మార్చుకొని నాలోని పసితనానికి తనలోని కొంటెతనంతో పరిపక్వత చేకూర్చే ప్రియుడు ఎక్కడ వున్నాడో... ఏం చేస్తున్నాడో... ఎప్పుడు కలుస్తాడో... ఎలా నన్ను వరిస్తాడో... అని పరిపరి విధాల ఆలోచనలు చేస్తూ... కొన్ని కవన పదాలను లిఖిస్తూ... నాకు నచ్చిన వాడు ఎక్కడున్నాడో అనుకుంటూ... ఆలోచనలో లీనమై పోయా...అదే ప్రేమ ఊహలో బిజీ గా మారిపోయా. నా పేరు కీర్తి (శృతకీర్తి) "నేను అందర్లాంటి అమ్మాయిని కాదు...నేనో స్పెషల్" అనేది నా ఫీలింగ్. ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుందిలే "ఎవరికి వారు ప్రత్యేకం అనుకోకపోతే...వాళ్ళలో మరో... బుద్ధుడు ఉన్నాడనో లేక బుద్ధిలో కొంచెం తెలివి ఎక్కువ తక్కువల ప్రవాహంతో మన సాధారణ ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయనో" ఫిక్స్ అవ్వాలి సుమా..! ప్రతి రోజూలానే ఇవాళ కూడా కాలేజీకి వెళ్ళెందుకు ఫ్రెండ్స్ తో కలిసి కాలేజీ బస్సులో ప్రయాణిస్తున్న  ...

మధుర స్వప్నంలో అధర సంతకం

చిత్రం
సంధ్యా సమయంలో చెరువు గట్టుపై కూర్చొని ప్రకృతిని తీక్షణంగా వీక్షిస్తూ... నాతో నేను మదిలో మాట్లాడుతూ ఉండగా వెనుక నుంచి నా కన్నులు మూసిన చేతుల స్పర్శ నా కనురెప్పలకు కాస్త నొప్పి కలిగించింది. ఆ మనిషి ఎవరో తెలుసుకుందాం అని ఎవరు అని నేను అనగానే స్వరాన్ని సవరిస్తూ... ఎవరో చెప్పుకోండి చూద్దాం అనే మాట వినపడింది. నేను ఎవరో తెలియదు అని చిన్నగా నవ్వాను కన్నులు మూసిన ఆ చేతులు నన్ను వీడి నాకు అందమైన ప్రపంచాన్ని చూయించడమే కాదు మనసు మురిసిపోయేలా ఏ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నానో ఆ ఎదురు చూపులు ఫలించేలా ఆనందం ప్రసాదించాయి నా కనులు మూసిన వ్యక్తి నా ముందుకు వచ్చి అయ్యో పొరపాటు జరిగింది నా అభిసారిక నాకోసం ఎదురుచూస్తుంది అనుకొని మిమ్మల్ని వెనక నుంచి చూసి అలా తప్పు చేశాను అయినా కానీ తప్పు జరిగిపోయింది ఐ లవ్ యూ అండి అని నవ్వసాగాడు ఏంటీ తప్పు చేస్తే ఐ లవ్ యూ చెప్తారా తమరు అని నేను కొంచెం కోపం ప్రదర్శించాలని చూసి రేయ్ సత్య నిన్ను... అని నేను ప్రేమతో కొట్టబోయాను తను నా చేతులు పట్టుకుని ఏంటే నేను ఎవరో తెల్వదా అని నన్ను తనకేసి అదిమి పట్టుకుని ఆటపట్టిస్తున్నాడు తన చేతులు ఎంత బలంగా ఉన్నాయం...

హృదయ సంఘర్షణ

చిత్రం

ఇష్క్

చిత్రం

నాలోని నీకై

చిత్రం
నీకై నాలో నేను మాట్లాడుకుంటుంటే నాకే !తెలియని భాష పరిచయమైంది నాలో నిన్ను నేను చూస్తుంటే ఏదో తెలియని భావన కల్గుతుంది నాలోనీ నీకై నేను ఆలోచిస్తుంటే ఏదో! అద్భుతంగా అన్పిస్తుంది ఈ నాలోని నిన్ను నీవు చూడాలనుకుంటే నీలో నన్ను చూస్తూ .... నన్ను తలచిన మరుక్షణమే ! నీ అందాన్ని చూయించే ప్రతిబింబాన్నై నిన్నే నీకు కొత్తగా పరిచయం చేస్తా!

దోస్త్

చిత్రం
తీపి,పులుపు,వగరు కారం,చేదు,ఉప్పు అనే షడ్రుచుల సమ్మేళనంలా  జిందగీలో ఎదురయ్యే అనుభవాలు సుఖం దుఃఖం, కష్టం నష్టం, బాధ సంతోషం  మనసులో కలిగే ఉద్వేగాలు స్నేహం మోహం వ్యామోహం ప్రేమ ఆప్యాయత అనురాగం విరక్తి వైరాగ్యం లాంటి వాటి వల్ల ఆందోళననో, ఆనందమో... ఏదైనా సరే స్వీకరిస్తూ...జీవనయానం సాగిపోవాలని  తెలిపే...అర్థవంతమైన తత్వమే... ఉగాది పచ్చడి విశిష్టత  అలాంటి మనస్తత్వం కలిగిన మా మనసుల సమ్మేళనంలో మర్చిపోలేని...అనుభవాలు  గుర్తుండిపోయే...క్షణాలు  సంతోషపడిన...సమయాలు  ఎప్పటికప్పుడు నూతనంగా రూపుదిద్దుకునే మా జిందగీ ఎవరికి అర్థం కాని పరిచయం వేరే ఎవరితోను పోలిక లేని స్నేహం అహం అణువంతయిన కానరాని దోస్తాన్ వేర్వేరు లక్ష్యాలున్న... ఉమ్మడి ప్రణాళికల కలిగిన అభ్యర్థులం ఉద్యోగార్థులం  ఒక్కొక్కరు‌... ఒక్కో తీరుగా సంతోషం సొంతమైన వాళ్ళం  ఫిల్టర్ లేని మాటలతో... ఫిలాసఫీకల్ గా మాట్లాడుకునే మనుషులం జాతి రత్నాలం😜 ఉగాది పచ్చడిలో రుచిలా... అందరం కలిసి ఎంజాయ్ చేస్తున్న సోపతులం  హ్యాపీ ఉగాది 😋🥳