హ్యాపీ బర్త్ మా
అమ్మా...
నీకు ఏడాదికి మూడు పుట్టినరోజులు
పుట్టిన రోజు తెలియకపోయినా
ఆధార్ లో ఉన్న
పుట్టిన రోజుతో కలిపి నాలుగు సార్లు
నీ బర్త్ డే వస్తుంది ❣️
అందులో నాది ఒకటి
నీకు చదువు రాకపోయినా...
మా బర్త్ డే లు భలే గుర్తుంచుకున్నావ్ చూడు
అమ్మలంటే ఆషామాషీ కాదు అద్భుతం అంతే మా❣️
అన్నయ పుట్టిన రోజును
అట్టముక్కపై రాయించి
దాన్ని జాగ్రత్తగా ఇప్పటికీ దాచి ఉంచి
మేం ఎదుగుతూ
చదువుకునే వయసులో చూపించినవ్
అప్పటి నుంచి క్రమం తప్పకుండా
అన్న బర్త్ డే ను ఎంజాయ్ చేస్తూ...ఉన్నం
ఇక నా పుట్టిన రోజు
కథైతే... చాలా గమ్మత్తుగా చెప్తవ్ చూడు
అది వింటుంటే మస్త్ ఖుషీ అయితదే
కొత్త సంవత్సరం ముగ్గులేసిన తెల్లారే
సంక్రాంతికి ఇంకా పది దినాలుండగా
నువు పుట్టినవ్ అంటే...
గప్పుడు తెలిసింది...
అంటే మనం కొత్తేడాది రెండో తారీఖున
భూమ్మీదకు వచ్చినం అని
ఇగ అప్పటి నుంచి... నేను అవతరించిన దినం
కొంత కొత్తగా అనిపిస్తది
ఇగ ఇయ్యాల... పొద్దున అన్న విష్ చేయడం
చెల్లి వీడియో కాల్ లో HBD చెప్పడం జరిగింది
అమ్మా...నువు మాత్రం
హ్యాపీ బర్త్ నాయిన అని ఫోన్ లో చెప్తుంటే
కొంచెం ఎమోషన్ తో ఖుషీ అయిననే
ఎంత ప్రేమతో చెప్పినవో కానీ
నిజంగా చాలా కొత్తగా అనిపించిందే ఇయ్యాల
ఎంతో మంది వాట్సాప్ స్టేటస్ లో...
విషెస్ చెప్పినా కలగని ఆనందం
నువు విష్ చేస్తే...కలిగింది
అందరూ విష్ చేస్తే... థ్యాంక్స్ చెప్పిన నేను
నువు విష్ చేసేసరికి
థ్యాంక్యూ మా నన్ను కన్నందకు
ఎన్ని కష్టాలొచ్చినా పెంచి పెద్దచేసినందుకు అని
మనసులో అనుకుంటూ...సంతోషంతో మురిసిపోయానే
నాతో పాటు మళ్ళీ పుట్టిన నీకు కూడా
హ్యాపీ బర్త్ డే మా...
పురిటి నొప్పులతో సంతోషమైన బాధ పడుతూ...
బిడ్డలకు జన్మనిచ్చి మళ్ళీ పురుడోసుకునే...ప్రతి అమ్మ
పిల్లల పుట్టిన రోజున మళ్లీ జన్మిస్తుంది 💯
అందుకే... పుట్టిన రోజు శుభాకాంక్షలు మా ❣️😍😘
#jan2
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి