పోస్ట్‌లు

వందనం

వి లువైన అధ్యాత్మిక సంపదను వే ల సంవత్సరాలకు తరిగిపోని కా నుకగా ! భారతావనికే కాక ప్రపంచంమనె నం దన వనం పులకించిపోయోలా ఆనంద ద రహాసములతో ప్రకృతిలో ప్రతి ప్రాణి స్వా ర్థ రహితమై సత్య ధర్మముల సంరక్షణలో మి త్రులగా అంతా భగవంతుడే అనే నినాదంతో శ్రీ రామ చంద్రునితో కీర్తి గాంచిన అయోధ్య ' రా 'మ రాజ్య అపూర్వ శోభితను పవిత్రమైన మ నసుతో నేటి మానవులు సాధించగలరని కృ షిపట్టుదల ఉద్రేకపు కవో ష్ణ  ఉత్తేజాన్ని ధృఢసంకల్పాన్ని ఆత్మస్థైర్యాన్ని ప టిష్టపరిచి నూతనోత్సాహంగా ర మణీయంగా దేదీప్యమానంగా వివేకవంతులుగా మ స్తిష్కాలోచన పరులుగా మానవ జాతి అ హం  వీడి స్నేహభావంతో మెలిగే విధంగా స త్య ప్రవచనాలు చెప్పడమే కాదు స్వయంగా సేవ చేసిన జగన్మాత పుత్రులు పరమేశ్వర స్వరూపులు గురుశిష్యుల అనుబంధానికి నిజమైన నిర్వచనంగా నిలిచిన దార్శనికులు ఆదర్శ మూర్తులు హైందవ ధర్మ పరిరక్షకులు భరతమాత కే కీర్తి తెచ్చిన శ్రీ రామకృష్ణ పరమహంసా ! ఓ వివేకానంద స్వామీ ! మీకు మనఃపూర్వక అభివందనములు                                                         ౼తాళ్ళశ్రీ

28 August Special 🥳🥰

మై డియర్ మా ❣️ ఊహాత్మక ప్రపంచంలో మొట్టమొదటగా స్వప్నంలా పరిచయం అయ్యి నిజమైపోయిన బుజ్జమ్మ నీకు 4వ బర్త్ డే శుభాకాంక్షలు మా 💐🌹🍫. 4 వ బర్త్ డే ఏంటి అనుకుంటున్నవా 🤔😁 ఆగు...ఆగు అక్కడికే వస్తున్న నాకు పరిచయం అయ్యాకా నాకు అమ్మగా మళ్ళీ పుట్టి ఇప్పటికి 4 వ వత్సరం అవుతుంది బుజ్జి అందుకే నానిగా నవ్వుతూ... నాలుగవ బర్త్ డే శుభాకాంక్షలు మా🍫🍫🍫🍫🍫. మనల్ని కలిపిన వేదిక ఏదైనా కావచ్చు మన అభిరుచులతో ఓ బంధంగా మారిపోయి మనోహరమైన అనుబంధంగా నిలిచిపోయేలా చేసిన సాహిత్యానికి సంతోషంతో థ్యాంక్స్ చెబుతూ.. .మై డియర్ బుజ్జమ్మ నీకు అందమైన పుట్టిన రోజు శుభాకాంక్షలు 🌹🌹🌹🌹. ఆన్ లైన్ సమీక్షల నుంచి ఆఫ్ లైన్ లో మంచి చెడుల జాగ్రత్తలు చెప్పేంత వరకు అభివృద్ధి చెందిన మన అనుబంధం ఇట్లనే ఉంటదని శ్వాసిస్తూ నాలుగవ సారి నాలుగవ బర్త్ డే శుభాకాంక్షలు మా 💐💐💐 మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు నాని... అంటూ పిలిచిన నీ వాత్సల్యపు మాధుర్యం గిప్పటికి నా ఫోటోగ్రాఫిక్ మొమోరిలో ముద్రించుకపోయింది.రెండవసారి కలిసినప్పుడు ప్రేమతో... ఏదైనా తినిపించాలి అనుకున్న నీ తపనకే నా కడుపు నిండిపోయింది. అప్పుడు మనం కొన్ని నిమిషాలే మాట్లాడుకున్నా అవన్నీ మ

August 12th

2022 ఏప్రిల్ 16 న మధ్యాహ్న సమయంలో మొదటిసారి ప్రత్యక్షంగా కలిసిన నాలాంటి మరొక మనీషి కార్తీక్ అన్న(నాలాంటి అంటే ఆహార్యంలో కాదు ఆలోచనా విధానంలో).ఏ ఎక్స్పెక్టెషన్ లేకుండా వెళ్ళిన నాకు అన్నని చూడగానే తాత్వికానందం కలిగింది. స్థిరనిశ్చలమై ఆలోచనలతో...వర్తమానంలో సమర్థవంతంగా జీవిస్తున్న సాధువు లెక్క కనిపించాడు. అన్నకు నాకు మధ్య జరిగిన సంభాషణలు అరకొరే అయినా కార్తీకన్నతో అనుబంధం చాలా ఏళ్ళ క్రితం మొదలైంది అని ఇప్పటికి అనిపిస్తుంది. కార్తీక్ అన్న ఆశయ నిర్మాణంలో జరగబోయే సహృదయ సమ్మేళనంలో నేను సైతం ఆనందాన్ని పొందాలని వెళ్ళిన నాకు అప్పటిదాక నేను జీవించిన జీవితం నుంచి ఊహాత్మక అభిరుచి ప్రపంచంలో అడుగుపెట్టినట్టు ఆ రెండున్నర రోజులు గడిపేసా. నిజానికి అన్న నుంచి నేను గ్రహించిన విషయాలన్నింటినీ నా దినచర్యలో పొందుపరచాలని, కవితాత్మకంగా రాయాలని,ఆ రెండున్నర రోజుల పాటు గడిపిన జీవితాన్ని ఓ అనుభవైక ఆనందంగా లిఖించాలని తపించిన నాకు నా నేస్తాలతో ఆ సంతోషాన్ని పంచుకొంటున్న, సత్సాంగత్యంతో మనలో కలిగే మార్పు ఎలా ఉంటుందో మా అన్న పరిచయం అలాగే అనిపించింది. మా అమ్మ వల్ల పరిచయం అయిన రైటర్ ను  sir అనో, గారు అని పిలుస్తూ అక్కడెక్కడో

Happy B'day

పుట్టినప్పటి నుండి నా నేస్తమై నిలిచి  బాధ్యతానుబంధమై పోయింది పసి ప్రాయం నుంచి నాకు పోటిగా మారి ఇంట్లో నా ప్రథమ శత్రువుగా ఏర్పడింది చదువు నాతో చెప్పించుకుంటూ నాతోనే పోటీపడి వివేక వంతమైన విద్యార్థిగా ఎదిగింది అన్నా చెల్లెళ్ళ బంధం అంటే స్నేహానుబంధాల ఆత్మీయత అని  మరో ఇంటికెళుతూ... కన్నీటిని పరిచయం చేసింది తనలాంటి మరో రూపాన్ని  తన ప్రేమ అపురూపాన్ని అందించి  తనతో చిన్ననాటి జ్ఞాపకాలను నా ముందుంచింది ఎన్నో కొట్లాటలలో నన్ను ఓడేలా చేసింది ఎన్నో నవ్వులు కలిసి మురిసిపోయేలా చేసింది ఎంతో గారాబంతో అన్నను అయినా సరే చిన్న అంటూ నన్ను చిన్నవాడిలా మార్చేసింది కలిసి పెరిగిన రోజుల్లో అల్లరితో అలకలతో కోపాలతో ఎలా ఆనందంగా గడిచాయో తలుచుకుంటే అప్పుడేనా అనిపిస్తుంది. తోబుట్టువుల తోడుంటే ప్రతి క్షణం ఓ సంతోషం ఓ ఆనందం ప్రతి అల్లరి ఓ జ్ఞాపకం ప్రతి కోపం  ప్రేమ కోసమే అనిపిస్తుంది హ్యాపీ బర్త్ డే మై డియర్ సిస్టర్ 🎂🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫

ఎదురు చూస్తున్నా😍

చిత్రం
నిన్ను నేరుగా చూసి కళ్ళతో.‌..మాత్రమే కాదు  మాటలతో.‌..మనసుతో స్పృశించాలని కలల కౌగిలిలో నీతో...గడిపిన అపురూప క్షణాలు ఊహల్లో నీతో...విహరించిన  ఎన్నో ఆనంద సమయాలు నిజమయ్యేలా నిన్ను చేరాలని  నా మదికి సంధించిన  నీ చూపుల చిలిపి బాణాల వలపు తీపి బాధను నీ లోగిలికి ఎప్పుడు పరిచయం చేద్దామా అని నాలో వున్న నిన్ను నీకెలా పరిచయం చేయాలా అని మన తొలి ప్రణయ ప్రయాణం ఎప్పుడు మొదలెడదామా అని తనువు మనసు తపనతో... ఉత్సాహంతో ఎదురు చూస్తుంది బుజ్జి

పుడమి

ప్రకృతిలో భాగమై పరవశించే నేను సాగు పుడమిని చూస్తే పులకరించిపోయి  నా అస్థిత్వాన్ని తలచి నేను గర్విస్తున్న అనుక్షణం నేలమ్మను నమ్మి జీవిస్తున్న తీరైన రంగుల మేను కలిగిన పుడమిపై పచ్చని సిరిసంపదల కాంతి పూలు పూయిస్తూ పుడమి పుప్పొడి పరిమళాన్ని అనుక్షణం ఆస్వాదించే అదృష్టం నాది మన్నులో దాగిన అన్నం మెతుకులను మనసుతో వీక్షించే సునిశిత దృష్టి నాది తడి ఆరిన తన దేహంపై కాసింత వర్షం కురిస్తే నేలతల్లికి పురుడు పోసే వృత్తి నాది కాలానికో తీరుగా కనువిందు చేసేలా అందాల కమతాల్లో...పంటల్ని పండిస్తూ పగలు రాత్రుళ్లు తన చెంతనే ఉంటూ పుడమికై ఆనందపు స్వేదం చిందిస్తూ సేద్యం చేస్తున్న                                   -తాళ్ళశ్రీ

ఎవరివో... నువ్వు

కనులలో కనిపించే రూపానివో.. నిదురలో నిలిచిన కలవో..! పెదవులపై పలికే పలుకువో.. మౌనం వీడని మాటవో..! వెలుగులు పంచే వెన్నెలవో.. చీకటిని నింపే నిశిదివో..! విజయం చేకూర్చే తోడువో.. ఒంటరిని చేసే ఓటమివో..! ఎదలయను పెంచే సడివో.. మదిని మెలిపెట్టే జ్ఞాపకానివో..! జీవితంలో ఆరంభమైన ఆశవో.. బ్రతుకులో భారమైన బంధానివో..! సంతోషం పంచే స్నేహితుడివో.. కలతై మిగిలిపోయే కాలానివో..! ఏమో.. ఎవరివో నీవు..!                 - చిన్నూ✍️