ఎవరివో... నువ్వు

కనులలో కనిపించే రూపానివో..
నిదురలో నిలిచిన కలవో..!

పెదవులపై పలికే పలుకువో..
మౌనం వీడని మాటవో..!

వెలుగులు పంచే వెన్నెలవో..
చీకటిని నింపే నిశిదివో..!

విజయం చేకూర్చే తోడువో..
ఒంటరిని చేసే ఓటమివో..!

ఎదలయను పెంచే సడివో..
మదిని మెలిపెట్టే జ్ఞాపకానివో..!

జీవితంలో ఆరంభమైన ఆశవో..
బ్రతుకులో భారమైన బంధానివో..!

సంతోషం పంచే స్నేహితుడివో..
కలతై మిగిలిపోయే కాలానివో..!

ఏమో.. ఎవరివో నీవు..!



                - చిన్నూ✍️

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

August 12th

ఎప్పుడు చూశానో