సామాజిక స్పృహ
సమాజ హితమై స్థాపించెటి సంఘాలెన్నో.....
సేవ చేస్తనని పదవి దాహంతో
పుట్టుకొచ్చె పార్టిలెన్నో.....
అక్రమసంపద దాచుకొనుటకై
బీదల పేరున బినామిలెన్నో...
నల్లధనం వెలికి తీయుటకు
ఖర్చయ్యే ప్రజల కాసులెన్నో.....
పరిష్కరించని సమస్యలెన్నో...
ప్రభుత్వమెర్పరిచె కమిటిలెన్నో...
న్యాయధర్మాల్ని సరితూచేందుకు
దొంగ సాక్ష్యపు త్రాసులు ఎన్నో.....
డబ్బులున్నోడి రక్షణకై
చట్టమెర్పర్చిన లొసుగులు ఎన్నో ఎన్నేన్నో
వీటన్నింటినీ రూపుమాపుటకు
దీనులను లేని దివ్య జగతికై
ధీరోదాత్తపు సంకల్పంతో
నెత్తురు మండే గుండెలతో
నెగడిల వెలిగే చూపులతో
ఆక్రోశపు ఆలోచనలతో
ఆవేదనలు అంతమెందుటకు
చలం కలంలో ఆవేశంతో
శ్రీశ్రీ రచనల అభ్యుదయం తో
వివేకవంతుల విప్లవ స్పూర్తితో
సామాజిక స్పృహనే కలిగి
మనకెందుకు లే అనే మబ్బుని వదిలి
నవ యువతరము నడవాలి
నవ్య భారతం నిర్మించాలి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి