మౌనం
మౌనమై నేనుంటే
ఎంతో అద్భుతమైన భావనలతో
నన్ను మురిపిస్తావు మైమరిపిస్తావు
మౌనమై నేనుంటే
విచారానికే విరహం తెప్పిస్తూ....
విలువైన జీవితపు పరమార్థాన్ని తెలియజేస్తాను
మౌనమై నేనుంటే
గతకాలపు స్మృతులను
జ్ఞప్తికి తెస్తూ....
నా గురించి నేను ఆలో'చించేలా' చేస్తావు
మౌనమై నేనుంటే
నా మది మాటల్ని
నే వింటూ....
కవిత్వాన్నే రచించేలా చేస్తావు
మౌనమా...
నీకు వందనం 🙏
మీ మౌనం... ఎంతో మాట్లాడుతుంది.. చాలా బాగుంది.🙂
రిప్లయితొలగించండి